నిరంతరం మండే నిప్పుల కొలిమి ఆరిపోని విప్లవజ్యోతి ‘చే గువేరా’.

‘చే’ 51 వ వర్ధంతి నేడు.

రాజ్ కుమార్,కరీంనగర్:

1928 మే 14న అర్జెంటీనా దేశం రొసారియాలో జన్మించాడు. చదివింది వైద్య విద్య అయినా ఈ ప్రపంచానికి పట్టిన చీడ ,పీడలను వదిలించడం కోసం తన గెరిల్లా పోరాటం తో ప్రపంచానికి పోరాట పటిమ చూపిన ప్రపంచ విప్లవకారుడు చేగువేరా.దాదాపు 9 నెలల పాటు లాటిన్ అమెరికా దేశాలలో ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను తెలుసుకోవడం బాధలను చూడడం కోసం తన మిత్రునితో కలిపి చేగువేరా చేసిన మోటార్ సైకిల్ యాత్ర అతని జీవితాన్ని గమ్యాన్ని గతిని మార్చాయి.తాను చదువుకునే రోజుల్లో క్యుభా ప్రజలు పడుతున్న బాధలను సాటి విద్యార్థి ఫిడెల్ కాస్ట్రో చేగువేరా కు చెప్పగా 1956 జనవరిలో క్యూబా పై దాడికి శిక్షణ ప్రారంభించారు.

కొత్త 82 మందితో సాయుధ దళం ఏర్పాటు చేసుకొని నవంబర్ నెలలో క్యూబాలో అతి పెద్ద నగరం పై ప్రారంభించారు. 1959 లో batista నియంత నుంచి క్యూబా దేశానికి విముక్తి లభించింది.పుట్టింది అర్జెంటీనా అయినా క్యూబా పరిశ్రమల శాఖ మంత్రిగా cuba సెంట్రల్ బ్యాంకు చైర్మన్ గా ఆ దేశ పునర్నిర్మాణంలో చేగువేరా చేసిన కృషి అంతా ఇంతా కాదు క్యూబా దేశాన్ని అన్ని రంగాల్లో ముందుంచడం కోసం రేయింబవళ్ళు తన చెమటను ధారపోసిన మహత్తర విప్లవ నాయకుడు చే గువేరా.అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే 1965లో క్యూబా నుండి తప్పుకొని ఒక సంవత్సరం పాటు కాంగో దేశానికి అజ్ఞాతంలోకి వెళ్లారు 1966లో బొలీవియాలో సాయుధ పోరాటానికి సిద్ధం అయ్యి పోరాటం ఏర్పాట్లకు వ్యూహా రచన చేశాడు అక్కడి ప్రజలు సాయుధ పోరాటానికి సహకరించక అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించడం అక్కడ ఉన్నటువంటి ఆ దేశ పరిస్థితులు కూడా అనుకూలంగా లేకపోవడం మూలంగా 1967 అక్టోబర్ 8న అమెరికా సంబంధించిన సి ఐ ఏ రక్షణ దళాలకు చిక్కడంతో అక్టోబర్ 9న చిత్రహింసలు పెట్టి నీ రాయుదున్ని చేసి కాల్చి చంపారు.అసలు ఎవరు ఈ చేగువేరా ఎక్కడ పుట్టాడు. ఏం చదివాడు. ఏం చేశారు. ఈ తరానికి తెలియాల్సిన అవసరం చాలా ఉంది.ప్రపంచంలో ఎక్కడో ఒక మారుమూల దేశంలో పుట్టిన దేశం కాని దేశం పరాయి దేశం కోసం ప్రాణాలను తృణంగా పెట్టిన చేగువేరా ప్రపంచ విప్లవోద్యమ చరిత్రలో చెరిగిపోని సంతకం గా నిలిచి పోయాడు.

అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా లాటిన్ అమెరికా దేశాలలో చేగువేరా చేసిన పోరాటం తరిగిపోని స్ఫూర్తినిస్తుంది చే. ఏనాడూ ఆయన జీవితంలో వ్యక్తిగత ప్రయోజనాల కోసం పదవుల కోసం పేరు కోసం హోదా కోసం పనిచేయలేదు ప్రపంచవ్యాప్తంగా అమెరికా సామ్రాజ్యవాద దేశాల ప్రజలు పడుతున్న బాధల నుంచి విముక్తి చేయాలని ఆ విముక్తి సాయుధ పోరాటం తోటి సాధ్యమవుతుందని భావించిన విప్లవ నాయకుడు చేగువేరా. ప్రజలకు వైద్య సేవ అందించాల్సిన ఒక అసాధారణ డాక్టర్ అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా విప్లవోద్యమానికి ఆజ్యం పోయడం విముక్తి కోసం పోరాటాన్ని ఎంచుకోవడం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సాయుధ పోరాటం విప్లవ మార్గం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ కొనసాగించిన పోరాటం ఎన్నో ఉద్యమాలకు ఊపిరి నివ్వడమే కాకుండా నేటి విద్యార్థి యువతకు చేగువేరా రోల్ మోడల్ గా మారారు. చేగువేరా ఎవరో తెలియక పోయినా నేటి తరం యువకులు టీ షర్ట్ ల మీద బైకులు వాహనాల మీద అతని బొమ్మ అభిమానంతో వేసుకుంటారు. నిరంతరం ఆరిపోని విప్లవజ్యోతి. ప్రపంచ విప్లవానికి వెలిగిస్తూ విప్లవ పోరాటాలకు స్ఫూర్తి ‘చే గువేరా’.