నీరవ్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు.

ఢిల్లీ;
పిఎన్బీ కుంభకోణం కేస్ లో నీరవ్ మోదీ కి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోది కి ఇంటర్ పోల్ అధికారులు ఈ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. సీబీఐ అభ్యర్థన మేరకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది.