నీలక్కల్ లో మహిళా రిపోర్టర్ కి వేధింపులు.


తిరువనంతపురం:
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి అడుగు పెడదామనుకుంటున్న మహిళలకు నిరాశే ఎదురవుతోంది. ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్టులకు అవమానాలు, వేధింపులు తప్పడం లేదు. శబరిమల దేవస్థానానికి వెళ్లేందుకు ప్రధాన మార్గమైన నీలక్కల్ దగ్గర గుంపులు మహిళలను అడ్డుకొంటున్నారు. ఒక మహిళా రిపోర్టర్ కి కూడా ఈ గండాలు తప్పలేదు. కారులో వెళ్తున్న మహిళా జర్నలిస్టును ఆకతాయిల గుంపు ఒకటి అడ్డుకొంది. ఆయుధాలతో తిరుగుతూ, చట్టవిరుద్ధంగా గుమికూడి, దాడులకు పాల్పడుతున్నందుకు వారిపై ఆ జర్నలిస్ట్ పెరునాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును పంబా పోలీస్ స్టేషన్ కి బదిలీ చేయనున్నట్టు తెలిసింది.