నెల్లూరు జిల్లా టీడీపీ లో ముసలం. టీడీపీ కి ఆనం గుడ్ బై.

నెల్లూరు:
మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యవహారం మొదటికొచ్చింది.టీడీపీ నుంచి బయటికి వొచ్చేయమంటూ ఆయన కుటుంబసభ్యులు ,అనుచరుల నుంచి వొత్తిడి పెరుగుతున్నది.పార్టీ వీడే విషయంపై హైదరాబాద్ లో కీలక నేతలు ,కుటుంబ సభ్యులతో అనం రామనారాయణ రెడ్డి సమాలోచనలు జరుపుతున్నారు. చర్చల అనంతరం నేడో ,రేపో టీడీపీ కి ,పార్టీ పదవికి రాజీనామా చేసే అవకాశం వుందని సమాచారం.భవిష్యత్ నిర్ణయంపై ఆయన మరికొంత సమయం తీసుకొనే అవకాశం ఉంది. ఒకే గూటికి చేరే ఆలోచనలో ఆనం బ్రదర్స్ ఉన్నారు.సింహపురిలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి.