నేరము – నగరమూ

కిశోర్, హైదరాబాద్:

హైదరాబాద్ సిటీలో హత్యలు పెరుగుతున్నవి. కారణం ఏదైనా సమస్య ఏదైనా, కత్తులకు గొడ్డళ్లకు పని చెబుతున్నారు. రోజుకోచోట ‘కోడిపీక’ కోసినంత ఈజీగా మనుషుల ప్రాణాలు తీసేస్తున్నారు.మొన్న కూకట్ పల్లి,నిన్న ఓల్డ్ సిటీ.,నేడు రాజేంద్రనగర్ వరుస ఘటనలే దీనికి నిదర్శనం.’కమాండ్ కంట్రోల్’ తో క్రైం రేట్ తగ్గిస్తామంటున్న ఖాకీల మాటలు గాలిబుడగలేనా.. ? రౌడీ దౌర్జన్యాలను తుదముట్టిస్తామన్న పోలీస్ బాస్ లు ఇస్తున్న భరోసా ఏమైందీ..? ‘క్రైం ఫ్రీ సిటీ’గా మారుస్తామని, అడుగడుగునా భద్రతా సిబ్బంది పెట్టామన్న కాప్స్ నిఘా విఫలమైందా..? వరుస సంఘటనలతో వణికి పోతున్న సిటీ జనం భయంతో బతకాల్సిందేనా..?

హైదరాబాద్ సిటీలో హత్యలు అలజడి స్రుష్టిస్తున్నాయి.రోజుకో చోట కత్తులతో దాడులు చేస్తూ రక్తం చూస్తున్నారు కిరాతకులు. సిటీలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉన్నది. సినిమాల్లో చూపినంత క్రూరంగా హంతకులు విరుచుకుపడుతున్నారు.పాత కక్షలతో , పగ, ప్రతీకారాలతో విచక్షణ కోల్పోయి వేటు వేస్తున్నారు.నిమిషాల్లో ప్రత్యర్ధుల పై వేటు వేసి ప్రాణాలు తీస్తున్నారు. ఓ వైపు సిటీలో ప్రతి చోట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశామన్న పోలీసులు చెబుతున్నా వరుసగా సిటీలో జరుగుతున్న దారుణాలు మాత్రం ‘సిటీకాప్స్’ కు సవాలు విసురుతున్నాయి.వారం రోజుల్లో వరుసగా పదికి పైగా హత్యలు, అత్యాచారాలు, దాడులు జరిగాయంటే సిటీలో భద్రతా వ్యవస్థ ఎలా ఉందనేది అర్దం చేసుకోవచ్చు.మొన్న కూకట్ పల్లిలో ప్రేమ జంట పై దాడి ఘటన మరవక ముందే, రాజేంద్ర నగర్ లో ఓ వ్యక్తి పై అత్యంత కిరాతకంగా గొడ్డలితో దాడి చేసి నరికి చంపేశారు దుండగులు.చంపిన వారు నేరుగా పోలీసుల ముందు లొంగి పోయారు. కూకట్ పల్లిలో దాడి చేసిన ప్రత్యర్ధులు సైతం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఓల్డ్ సిటీలో రౌడీ షీటర్ ను హత్య చేసిన ప్రత్యర్ధులు సైతం పోలీసుల ముందు లొంగిపోయారు. ఇలా సిటీలో జనం మధ్యలో మారణాయుదాలతో వ్యక్తుల పై దాడులు చేస్తూ,హత్యలు చేస్తూ, భీబత్సం స్రుష్టిస్తున్నారు కిరాతకులు. పోలీసుల నిఘా వైఫల్యమే దీనికి కారణామా! అంటే అవుననే అంటున్నాయి తాజా సంఘటనలు. జనంలో మారణాయుదాలతో సంచరించే వారి పై నిఘా లేక పోవడంతోనే జనం రద్ధీ ప్రాంతాల్లో దారుణాలు జరుగుతున్నాయనే వాదన వినిపిస్తుందీ.. ఓ వ్యక్తిని హత్య చేయడానికి పథకం వేసిన వారు ఆయుధాలతో సిటీలో సంచరిస్తున్నప్పడు అడుగడుగునా ఏర్పాటు చేసిన భద్రతా సిబ్బంది ఏమైందీ ? నిజంగా సిటీలో క్రైం రేటు తగ్గించడానికి పోలీస్ యంత్రాంగం పనిచేస్తే ఈ దారుణ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ అత్తాపూర్ పిల్లర్ నెం 143 వద్ద ఓ వ్యక్తిని నలుగురు వ్యక్తులు గొడ్డలితో నరికి చంపిన ఘటన స్థానికంగానే కాకుండా సిటీ , రాష్ట్రం మొత్తం నివ్వెర పోయేలా చేసింది.. సిద్ది అంబర్ బజార్ కు చెందిన రమేష్ అనే వ్యక్తి ఓ హత్య కేసులో కోర్ట్ లో హాజరై వస్తున్న క్రమంలో ప్రత్యర్ధులు దాడి చేశారు.అందరూ చూస్తుండగానే అతని పై విచక్షణ రహితంగా దాడి చేశారు. సిటీ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు అందరు ఉన్నా అతన్ని కాపాడలేకపోయారు.. అంటే సిటీలో నిఘా వైఫల్యమే కారణమా..? వారం రోజుల్లో జరిగిన దాడుల్లో ప్రతి చోట భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం కొంత కారణమనే చెప్పవచ్చు… ఇదిలాగే కొనసాగితే ఇక సిటీలో క్రైం రేట్ తగ్గేనా..? కారణాలు ఏవైనా కక్షలతో రెచ్చిపోయే వారిని కట్టడి చేయడం, హత్యలు , అరాచకాలు లేని సిటీగా మార్చడంలో భద్రత కల్పించలేరా..? క్రైం ఫ్రీ సిటీగా మారుస్తాం.అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్న పోలీసులు ఇలాంటి మానవ మ్రుగాలను పసిగట్టలేక పోతున్నారా..? మారణాయుధాలను పట్టుకుని సంచరించే వారిని ఎక్కడికక్కడికి కట్టడి చేస్తే ఇలాంటి దారుణాలు జరుగుతాయా..? ఇంత మంది సిబ్బంది , ఆధునిక పరికరాలు వినియోగిస్తున్న సిటీ కాప్స్ మరణ మ్రుదంగాలను మాత్రం ఆపలేక పోతున్నారు.. ఇప్పటికైనా సిటీలో దారుణాలకు ఒడిగట్టే వారిని పసిగట్టి బిక్కుబిక్కుమంటూ భయంతో వణికిపోతున్న సామాన్య జనాలకు భరోసా సిటీ పోలీసులు ఇవ్వాల్సిందే.