న్యాయవాదుల పనితీరు మెరుగుపడాలి. -సుప్రీం కోర్టు సి.జె.

న్యూఢిల్లీ :

దేశంలోని ప్రతి న్యాయవాది తమ పని తీరును మెరుగు పర్చుకోవాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గోగొయ్ సూచించారు. లాయర్ల పనితీరు సరిగా లేకపోవడంతో అండర్ ట్రయల్ ఖైదీల సంఖ్య పెరిగిపోతుందన్నారు. భారతదేశంలో 67 శాతం మంది అండర్ ట్రయల్ ఖైదీలు ఉన్నారని తెలిపారు. ఈ అండర్ ట్రయల్స్‌లో 47 శాతం మంది 18-30 సంవత్సరాల వయసున్న వారు ఉన్నారని చెప్పారు. లాయర్ల పనితీరు మెరుగ్గా ఉంటే.. అండర్ ట్రయల్స్ ఖైదీల సంఖ్యను తగ్గించొచ్చని సీజేఐ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ ఒక పెద్ద సబ్జెక్టు అని ఆయన చెప్పారు. భారతదేశంలో 13 నుంచి 14 లక్షల మంది న్యాయవాదులున్నారు. ఈ సంఖ్య సరిపోదన్న సీజేఐ.. యూఎస్‌లో ప్రతి 200 మందికి ఒక లాయర్ ఉంటే.. మన దేశంలో ప్రతి 1800 మందికి ఒక న్యాయవాది ఉన్నారని తెలిపారు. లాయర్ల సంఖ్య పెరగాల్సి ఉందన్నారు రంజన్ గోగోయ్.