న్యూ డెమాక్రసీ కమాండర్ అరెస్టు.

ఖమ్మం;
కూసుమంచి మండలం చౌటపల్లి శివారు బండమీది తండాలో అర్ధరాత్రి న్యూడెమొక్రసి గుండాల ఏరియా దళ కమాండర్ బోడ భీముడు సుధాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
20ఏళ్లుగా పార్టీ సానుబూతి పరుడిగా ఉండి గత 3సంవత్సరాలుగా ఆయన  గుండాల దళ కమాండర్ గా పనిచేస్తున్నారు. కొన్నాళ్ళుగా భుజం  నొప్పితో బాధ పడ్తున్న భీముడు రెండు రోజులుగా ఇక్కడ చికిత్స పొందుతున్నట్లు సమాచారం.కచ్చితమైన సమాచారం తో శనివారం తెల్లవారుఝామున భీముడును,ఆయనతో పాటు కూసుమంచి మండలానికి చెందిన భూక్యా మచ్చునాయక్ ను అదుపులొ కి తీసుకున్నారు. భీముడు వద్ద ఒక రివాల్వర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.