పంట కొనుగోలు చేసి పరారీ. పోలీసు కేసు నమోదు.

వ‌రంగ‌ల్:
వ‌్యాపారం పేరుతో రైతుల పంట‌ల‌ను కొనుగోలు చేసి, సుమారు 15 కోట్ల‌కుపైగా డ‌బ్బులు చెల్లించ‌కుండా మోసం చేసి పారిపోయిన దివ్య‌జ్యోతి ఎంట‌ర్‌ప్రైజెస్ య‌జ‌మానుల నుంచి రైతుల‌ను కాపాడాల‌ని కోరుతూ భాదితుల‌తో క‌లిసి వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్‌ను, వ‌రంగ‌ల్ పోలీస్‌ కమీష‌న‌ర్ ను క‌లిసి విజ్ఞ‌ప్తి చేసిన పాల‌కుర్తి ఎమ్మేల్యే ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావు. గ‌త కొన్ని సంవత్స‌రాలుగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని రాయ‌ప‌ర్తి, కొడ‌కండ్ల‌, వ‌ర్ధ‌న్న‌పేట‌, కేసముద్రం, నెల్లికుదురు, జ‌ఫ‌ర్‌గ‌ఢ్, తిరుమ‌ల‌గిరి మండ‌లాల్లోని ప‌లు గ్రామాల్లో నేరుగా ప‌త్తి, మొక్క‌జోన్న‌, ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు వ్యాపారం చేస్తూ.. రైతుల‌ను న‌మ్మించిన స‌ద‌రు వ్యాపారులు ఈ సంవ‌త్స‌రం రైతుల నుంచి కొనుగోలు చేసిన వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌కు డ‌బ్బులు చెల్లించ‌కుండా పారిపోయారు. వ్య‌వ‌సాయ‌మే ఆధారంగా బ్ర‌తుకులు వెళ్ల‌దీసే పేద రైతాంగం ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. స‌ద‌రు వ్యాపారి ఆచూకి క‌నుగొని, రైతుల‌ను ఆదుకోవాల‌ని కోరారు.