పధకాల కన్నా ‘భావోద్రేకాలు’ మిన్న. !!

కేసీఆర్ పూర్వాశ్రమం తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీకి గ్రామ,గ్రామాన, పోలింగు బూత్ స్థాయిలో క్యాడర్ ఉన్నది. పార్టీ నెట్ వర్క్ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలంగాణలోనూ టిడిపికి బలమైన పునాదులు ఉన్నవి. ఆ సంగతి కేసీఆర్ కు, ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి వంటి మాజీ తెలుగుదేశం నాయకులకు క్షుణ్ణంగా తెలుసు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి దశాబ్దాల క్రితమే హైదరాబాద్ వచ్చి స్థిరపడి నివసిస్తున్న వారిలో చంద్రబాబు వీరాభిమానులు ఉన్నారు. తెలుగుదేశంను తమ ‘ ఇంటిపార్టీ’ గా భావించే కమ్మ సామాజిక వర్గం ఉన్నది.గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో టిడిపి ప్రభావం ఎక్కువగా కనిపించింది. అందువల్ల టిడిపి తరపున గెలిచిన ఈ ప్రాంతాల ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లో కలిపేసుకున్నారు. ఎంపీ మల్లారెడ్డి కూడా గులాబీ జెండా ఎత్తుకొని తిరుగుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలనాటికి’ఆంధ్ర వలసల’ పట్ల టిఆర్ఎస్ దృక్పథం పూర్తిగా మారిపోయింది. వాళ్ళ కాలిలో ముల్లు గుచ్చుకుంటే తన పంటి తో తీస్తా అని కేసీఆర్ హైదరాబాద్ మహానగర వాసుల హృదయాన్ని కొల్లగొట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 కార్పొరేటర్ స్థానాలు గెలుచుకొని ఘన విజయం సాధించడం టిఆర్ఎస్ చరిత్రలోనే ఒక అపూర్వ సన్నివేశం. ఈ మహానగరంలో ఎలాంటి అల్లర్లు లేకుండా తెలంగాణ, సెటిలర్ల మధ్య గొడవలు లేకుండా ‘సహజీవనం’ చేస్తున్నారు. శాంతిభద్రతలు సజావుగా ఉండడం కేసీఆర్ కు కలిసివచ్చే అంశం. చాలా కాలం కిందటే ‘జాగోభాగో’ వంటి నినాదాలకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడంతా మిత్రులు, సహచరులే. సమాన పౌరులే. అయితే ‘ముందస్తు’ అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి అధ్యక్షునిపై జరుగుతున్న ప్రచార దాడి వెనుక భారీ వ్యూహం ఉన్నట్టు అనుమానాలు కలుగుతున్నవి. తెలంగాణ ప్రజల దృష్టిలో చంద్రబాబును ‘విలన్’ గా చూపడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. ”పొట్టగొట్టడానికి వచ్చిన వారితోనే మాకు పంచాయితీ . పొట్ట కూటి కోసం వచ్చే వారితో మాకు ఎలాంటి పేచీ లేదు.” అని2001 ఏప్రిల్ 27 న జలదృశ్యం లో చెప్పిన విషయాన్ని కేసీఆర్ మళ్ళీ ప్రజల ముందు ఉంచుతున్నారు. ప్రత్యర్ధులు సైతం ముచ్చట పడేలా ఆయన ఆకర్షణీయ ప్రసంగాలు ఉంటాయని కొత్తగా చెప్పవలసిన పని లేదు. తాజాగా కేసీఆర్ ఆయన టీమ్ టిడిపిని తెలంగాణలో ‘నియంత్రించడానికి’ సకల సన్నాహాలు జరుగుతున్నట్టు రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నవి.

ఎస్.కె.జకీర్.

”మన ప్రభుత్వం చేపట్టిన పథకాలే మనల్ని గెలిపిస్తాయి. టిఆర్ ఎస్ ప్రభుత్వం మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు” అని తెలంగాణా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ నిర్మాత కేసీఆర్ సెప్టెంబర్ 6వతేదీన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పారు. కానీ ఆ పార్టీ నాయకుల మాటలు, వ్యవహార శైలి అందుకు భిన్నంగా ఉన్నవి. కేసీఆర్ దర్శకత్వం ప్రకారమే పార్టీ నాయకులు ప్రచారసరళిని మలుపు తిప్పినట్టు కనిపిస్తున్నది. కేవలం తాము చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యకలాపాలే తనను గట్టెక్కించగలవనే నమ్మకం కేసీఆర్ లో సన్నగిల్లినట్లున్నది. అందువల్ల ‘సెంటిమెంటు’ వ్యవహారాలను బూజు దులిపి ప్రచార బరిలోకి లాగారు. కాంగ్రెస్, టిడిపి జతకట్టడం వల్ల టిఆర్ఎస్ కు గట్టి పోటీగా వాతావరణం మారే సూచనలు ఉన్నవి. తెలంగాణ అంతటా తమదే’ఇంటి పార్టీ’ గా టిఆర్ ఎస్ క్లెయిమ్ చేసుకుంటున్నా అంతే స్థాయిలో ఆ పార్టీని ‘ఓన్’ చేసుకునే వాళ్ళ గురించిన లెఖ్ఖలుతెలవలసి ఉన్నది. పార్టీ నిర్మాణం బలహీనంగా ఉంచాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఆ విషయాన్ని పట్టించుకోలేదని అనుకోవాలి. పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేస్తే ఇంకా అసంతృప్తులు, అసమ్మతులు, ధిక్కారస్వరాలూ, రాజీనామాలు వంటి వార్తలతో ఇబ్బందులు ఎదురుకావచ్చునని కేసీఆర్ అంచనా వేసి ఉండవచ్చును. పార్టీ క్యాడర్ బలంగా లేనందున అన్ని నియోజకవర్గాల్లోనూ పెద్దఎత్తున ‘వలసల’ కు తలుపులు తెరిచి పెట్టారు. అందుకే పలు నియోజకవర్గాలలో ‘పొటెన్షియల్ అభ్యర్థులుగా గుర్తింపు వచ్చిన కాంగ్రెస్, టిడిపి నాయకులను టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ క్యాడర్ సంగతి ఎలా ఉన్నా వివిధ పధకాల అమలు వల్ల ‘లబ్ధిదారుల’ సంఖ్య అపరిమితంగా ఉందని కేసీఆర్ భావన. కనుక వారంతా స్వచ్ఛందంగా పోలింగు బూతులకు వెళ్లి, ఇవిఎంలలో’కారు’ గుర్తును వెతికి, వెతికి ఓటు వేస్తారన్నకేసీఆర్ ఆత్మవిశ్వాసం ముందు ఎవరి విశ్లేషణలూ పనికి రావు. కేసీఆర్ పూర్వాశ్రమం తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీకి గ్రామ,గ్రామాన, పోలింగు బూత్ స్థాయిలో క్యాడర్ ఉన్నది. పార్టీ నెట్ వర్క్ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలంగాణలోనూ టిడిపికి బలమైన పునాదులు ఉన్నవి. ఆ సంగతి కేసీఆర్ కు, ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి వంటి మాజీ తెలుగుదేశం నాయకులకు క్షుణ్ణంగా తెలుసు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి దశాబ్దాల క్రితమే హైదరాబాద్ వచ్చి స్థిరపడి నివసిస్తున్న వారిలో చంద్రబాబు వీరాభిమానులు ఉన్నారు. తెలుగుదేశంను తమ ‘ ఇంటిపార్టీ’ గా భావించే కమ్మ సామాజిక వర్గం ఉన్నది.గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో టిడిపి ప్రభావం ఎక్కువగా కనిపించింది. అందువల్ల టిడిపి తరపున గెలిచిన ఈ ప్రాంతాల ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లో కలిపేసుకున్నారు.

ఎంపీ మల్లారెడ్డి కూడా గులాబీ జెండా ఎత్తుకొని తిరుగుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలనాటికి’ఆంధ్ర వలసల’ పట్ల టిఆర్ఎస్ దృక్పథం పూర్తిగా మారిపోయింది. వాళ్ళ కాలిలో ముల్లు గుచ్చుకుంటే తన పంటి తో తీస్తా అని కేసీఆర్ హైదరాబాద్ మహానగర వాసుల హృదయాన్ని కొల్లగొట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 కార్పొరేటర్ స్థానాలు గెలుచుకొని ఘాన విజయం సాధించడం టిఆర్ఎస్ చరిత్రలోనే ఒక అపూర్వ సన్నివేశం. ఈ మహానగరంలో ఎలాంటి అల్లర్లు లేకుండా తెలంగాణ, సెటిలర్ల మధ్య గొడవలు లేకుండా ‘సహజీవనం’ చేస్తున్నారు. శాంతిభద్రతలు సజావుగా ఉండడం కేసీఆర్ కు కలిసివచ్చే అంశం. చాలా కాలం కిందటే ‘జాగోభాగో’ వంటి నినాదాలకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడంతా మిత్రులు, సహచరులే. సమాన పౌరులే. అయితే ‘ముందస్తు’ అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి అధ్యక్షునిపై జరుగుతున్న ప్రచార దాడి వెనుక భారీ వ్యూహం ఉన్నట్టు అనుమానాలు కలుగుతున్నవి. తెలంగాణ ప్రజల దృష్టిలో చంద్రబాబును ‘విలన్’ గా చూపడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. ”పొట్టగొట్టడానికి వచ్చిన వారితోనే మాకు పంచాయితీ . పొట్ట కూటి కోసం వచ్చే వారితో మాకు ఎలాంటి పేచీ లేదు.” అని2001 ఏప్రిల్ 27 న జలదృశ్యం లో చెప్పిన విషయాన్ని కేసీఆర్ మళ్ళీ ప్రజల ముందు ఉంచుతున్నారు. ప్రత్యర్ధులు సైతం ముచ్చట పడేలా ఆయన ఆకర్షణీయ ప్రసంగాలు ఉంటాయని కొత్తగా చెప్పవలసిన పని లేదు. తాజాగా కేసీఆర్ ఆయన టీమ్ టిడిపిని తెలంగాణలో ‘నియంత్రించడానికి’ సకల సన్నాహాలు జరుగుతున్నట్టు రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నవి. కాంగ్రెస్, టిడిపి పొత్తులు అనైతికమనే వాదన ఎలాగూ ఉన్నదే. అసలు రాజకీయాల్లో నైతిక, అనైతిక విలువల గురించి ఎవరైనా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ”తెలంగాణాలో మరోసారి రాజకీయ కుట్రలకు చంద్రబాబు తెర తీశారు. తెలంగాణను అస్థిరపరచడానికి మొదట్లో కొన్ని ప్రయత్నాలు చేసి అభాసు పాలై రాష్ట్రం వదిలి వెళ్లి పోయి మళ్ళీ నక్క జిత్తులు ప్రయోగిస్తున్నారు” అంటూ ఎంపీ బాల్క సుమన్ తదితర నాయకులు విరుచుకు పడుతున్న తీరు చర్చకు దారితీస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో భారీ ఎత్తున డబ్బు పంపిణీకి రంగం సిద్ధంచేశారన్నది వారి ఆరోపణ.టిఆర్ఎస్80 కి పైగా అసెంబ్లీ స్థానాలు గెల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నందున ఇక కాంగ్రెస్ తో పొత్తు వల్ల ప్రయోజనమేమిటంటూ ప్రముఖ దినపత్రిక ఒక వార్తా కథనాన్ని వండి వార్చింది. 80 సీట్లు రావచ్చు, రాకపోవచ్చు. కేసీఆర్ చెబుతున్న 100 సీట్లు కూడా రావచ్చు. అంతిమంగా ప్రజలు చెప్పవలసిన తీర్పు. దానికింకా కనీసం మూడు నెలల సమయం ఉన్నది. ఈ లోగా ఇలాంటి జోస్యాలు చెప్పడం కాకతాళీయంగా జరుగుతున్న వ్యవహారంగా రాజకీయ పరిశీలకులు భావించడం లేదు. ఇలాంటి కథనాలు సెటిలర్లకు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం ఓటర్లకు ‘సందేశం’ పంపించడం కోసమేనన్న విమర్శలు ఉన్నవి. ”మళ్ళీ అధికారం కేసీఆర్ దే. కనుక వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు. కాంగ్రే లేదా టిడిపి కి ఓటు వేస్తే అది మురిగిపోయినట్లే !!” అన్నది ఆయా కథనాల సారాంశం. కాంగ్రెస్, టిడిపి జట్టుకట్టడం కేసీఆర్ మద్దతుదారులకు ఇష్టం లేదని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. కేసీఆర్ అంతరంగాన్ని బహిరంగ పరచడం కోసం ప్రత్యక్షముగా, పరోక్షంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.కేసీఆర్ ను తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చే పనిలో కొన్ని మీడియా సంస్థలు తలమునకలై ఉన్నవి. ” మళ్ల తెలంగాణ సెంటిమెంటు రెచ్చగొట్టే ప్రయత్నాలు మొదలైనయి. “ఆంధ్ర రాజకీయ పార్టీలతో దోస్తీ”, “తెలంగాణ ద్రోహులతో మిలాఖత్తు”, బిర్యానీ – పులావ్, పుంటికూర – గోంగూర, ఆన్యపు కాయ – సొరకాయ రాజకీయాలు మళ్ల మొదలైనయి. సెంటిమెంట్లనుఎగసనదోసి, మంటరాజేసి ఎన్నికల చలి కాచుకునే ప్రయత్నాలు మొదలైనయి.

 

నిజానికి ఇప్పుడు ఈ సెంటిమెంటు రాజేస్తున్నవాళ్లే నాలుగు సంవత్సరాలుగా ఆంధ్ర-రాయలసీమ కాంట్రాక్టర్లతో నెయ్యమాడుతున్నరు, వియ్యమాడుతున్నరు, వేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు దోచిపెట్టి, ముడుపులు సంపాయించిండ్రు. వీళ్లే “ఇప్పుడింక ఆంధ్ర ఏంది, తెలంగాణ ఏంది” అన్నరు, బాజాప్తాసెక్రటేరియట్ గోడల మీదనే తమ గురించి ఆంధ్రుల ఆశాజ్యోతి అని పొగడ్తలు రాయించుకున్నరు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిజేసినోళ్లందరిని “రాజకీయ పునరేకీకరణ” పేరుతోటి లోపలికి గుంజుకున్నరు. ఆలోచనలు మళ్లించి తెలంగాణకు ప్రథమశత్రువుఅయ్యాడని స్వయంగా జయశంకర్ చెప్పిన మనిషి జాన్ జిగ్రీ దోస్త్ అయిపోయిండు. వందల ఎకరాల ఊరుమ్మడి భూములు, చెరువులు, కుంటలు, ఊళ్ల బాటలు ఆక్రమించి గోడలు కట్టుకున్నోనికి “ఒక్క అంగుళం కూడ అక్రమంగా ఆక్రమించలేదు” అనికితాబులిచ్చిండ్రు. ఇంకో వెయ్యి ఎకరాలు గూడ ఇస్తమన్నరు. ఆంధ్ర పాలకుల, డబ్బుసంచులకు, వాళ్ల ఏజెంట్లకు, తెలంగాణను ఆరు దశాబ్దాల పాటు దోచుకున్నోళ్లకే మళ్ల వేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు, అడ్వర్టయిజ్ మెంట్లు అప్పగించిండ్రు. తెలంగాణ భాషను, చరిత్రను, సంస్కృతిని అవమానించినోళ్లనే పిలిచి పెద్దపీట వేసిండ్రు. వారు చస్తే గౌరవ వందనాలు, సెలవులు, స్మృతి చిహ్నాలు ఎన్నెన్నో ఆంధ్రప్రదేశ్ పాలకుల కన్న ఎక్కువ చేసిండ్రు. పాత కాంట్రాక్టర్లే, పాత పైరవీకారులే, పాత పద్ధతులే, కాళోజీ అన్నట్టు కొన్ని లేబుళ్లుమారినయి గాని సరుకు అదే. కొన్ని లేబుళ్లు గూడ మారలే. అట్ల తెలంగాణ సెంటిమెంటు మళ్ల వాడుకునే అర్హత లేని పనులు ఈ నాలుగేండ్లల్లనూటొక్కటిచేసిండ్రు. ఒక్కమాటలో చెప్పాల్నంటే, ఆ అరవై ఏండ్లల్ల తెలంగాణకు జరిగిన అన్యాయం తెలంగాణ దుష్మన్లతోని జరిగితే, ఈ నాలుగేండ్లల్ల తెలంగాణ ప్రజలకు, ప్రజా ప్రయోజనాలకు, సంస్కృతికి అన్యాయం తెలంగాణ పేరు జపించుకుంటనే జరిగింది. అట్ల తెలంగాణ ఆత్మాభిమానాన్ని అడుగడుగునా అవమానించినోళ్లే, ఆ అవమానానికి మద్దతిచ్చినోళ్లే ఇప్పుడు ఎన్నికల సమయం రాంగనే మళ్ల తెలంగాణ సెంటిమెంటు తురుఫాసుబైటికితీస్తున్నరు. ఈ తురుఫాసు చూసి కొందరు అమాయక తెలంగాణ బిడ్డలు పడిపోతున్నట్టు కనబడుతున్నది. ఈ నాటకం పేరు అందరూ దొంగలే” అనిఐటీవల సీనియర్ జర్నలిస్టు, ‘వీక్షణం’ ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ వ్యాఖానించారు.