పాపాత్ముని పాలన త్వరలో అంతం: డీకే అరుణ.

హైదరాబాద్:
యావత్తు తెలంగాణ ప్రజలని మోసం చేస్తున్న పాపాత్ముని పాలన త్వరలో అంతం కాబోతుందని కేసీఆర్‌పై డీకే అరుణ ఫైర్ అయ్యారు. అంతే కాకుండా గీత కార్మికులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు. టీఆర్ఎస్ పార్టీ భవనాలకు ప్రతి జిల్లాలో భూములు దొరికాయికాని కుల సంఘాల భవనాల కోసం ఎందుకు దొరకటం లేదో సమాధానం చెప్పాలన్నారు. గద్వాలలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి కేటాయించిన భూమిలో భవనం కట్టనివ్వమని అరుణ ఖరాకండీగా తెలిపారు.మీ నాయకులకు ఇసుక దందాలో ఒక్కరోజులో వచ్చే ఆదాయంతో భవనం కట్టుకోవచ్చు, అలాంటిది ప్రభుత్వం భూమి ఎందుకని ఆమె ప్రశ్నించారు. మరొక వైపు కులాలు చీల్చి లబ్ధిపొందాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరుణ మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో బానిస బతుకులు అయ్యాయన్నారు. కేసీఆర్ హామీలు చూశాం, మోసం చూశాం. ఇక చాలు ఇంతటితో కేసీఆర్‌కు చెక్ పెట్టడానికి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆరుణ పిలుపునిచ్చారు.
కేసీఆర్ పాలనలో గౌడలకు రాష్ట్రంలో వారికి జరుగుతున్న అన్యాయలను విన్నవించుకున్నారు. టీఆర్‌ఎస్ ప్రభత్వం హామీలు ఇచ్చి విస్మరించిన విషయం గుర్తు చేశారు. స్వయంగా వారితో డీకే అరుణ, మధుయాష్కీ చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హమీ ఇచ్చారు.
మధుయాష్కీ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్‌కి క్యాపిటల్‌గా హైదరాబాద్ మారిందని మండిపడ్డారు. రెడ్డి, గౌడ్లు రాజకీయంగా ఇబ్బందిగా మారుతారని ఆ వర్గాలను కేసీఆర్ వేధిస్తున్నారని, అందుకే రాజకీయంగా టీఆర్‌ఎస్‌ని బొంద పెట్టాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ముఖ్యంగా కల్లు గీత కార్మికులు సమస్యలను మేనిఫెస్టోలో చేర్చుతామని వారికి హామీ ఇచ్చారు. బడుగులు అంత ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఒకవేళ కేసీర్ మళ్ళీ గెలిస్తే బడుగు, బలహీన వర్గాలకు నష్టం కలుగుతుందన్నారు.