పారిశ్రామికవేత్త ‘మీలా’ కన్నుమూత!!

Suryapeta:

ప్రముఖ పారిశ్రామిక వేత్త, సుధాకర్ పివిసి అధినేత మీలా సత్యనారాయణ కన్నుమూశారు.
మీలా మృతి పట్ల మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు.”ఆయన ఆర్యవైశ్య కుటుంబాలకు అండగా నిలిచారు. వందలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. ఒక చిన్న యూనిట్ నుండి నేడు అతిపెద్ద పివిసి సంస్ధను తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, ఒరిస్సా లకు విస్తరించారు. ఒక మహా వ్రక్షం నేలకొరిగింది. పేద ప్రజలకు అండగా నిలిచి వారికి ఉపాధి కల్పించి ఎన్నో కుటుంబాలలో వెలుగులు నింపిన ఒక మహా జ్యోతి ఆరిపోయింది. తాతగారు అంటూ ఉద్యోగులు ప్రేమగా పిల్చుకునే మీలా సత్యనారాయణ ఇక లేరనేది వాస్తవం. వారి కుమారులకు, కుమార్తెలకు, వారి కంపెనీ ఉద్యోగులకు నా ప్రగాఢ సానుభూతి” అని మంత్రి అన్నారు.