‘పాలమూరు’లో ‘కోడ్’ ఉల్లంఘన.

ప్రశాంత్, మహబూబ్ నగర్.

మహబూబ్ నగర్ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. ఎన్నికల ‘కోడ్’ వచ్చినా కూడా టిఆర్ఎస్ పార్టీ తమ బ్యానర్లను విచ్చలవిడిగా నియోజకవర్గంలో హోర్డింగ్ ల రూపంలో వేస్తూన్నారు. ఇతర రాజకీయ పార్టీల పోస్టర్లు వేస్తే వెంటనే వాటిని తొలిగించాలని మున్సిపల్ అధికారులను బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీ పోస్టర్లు, హోర్డింగ్స్ కాకుండా వేరే పార్టీల పోస్టర్లు ఉండరాదనే చర్యలకు మహబూబ్నగర్ నియోజకవర్గంలోని టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్పడుతున్నారు. టి.ఆర్.యెస్ పార్టీ నాయకులు ఓటమి భయంతో కొట్టుమిట్టాడుతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. టిఆర్ఎస్ పార్టీ రాజకీయాలను నియోజకవర్గ ప్రజలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో గమనిస్తూనే ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతామని ప్రజలంటున్నారు.