పింఛన్ అడిగితే దెబ్బలు.

మహబూబ్ నగర్:
వీపనగండ్ల మండలం గోపాలదీన్నే గ్రామంలో భాస్కర్ గౌడ్ అనేటువంటి అనామకుడు తనకు పింఛను మంజూరు చెయ్యమని కొరినందుకు అమానుషంగా కొట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులను, అధికారులకు పింఛన్ కోసం ఎంతో కాలంగా మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపనాపోలేదు.గ్రామపంచాయతీ దగ్గర శుక్రవారం నాడు స్థానిక నాయకులు, పంచాయతీ సెక్రెటరీ ఉండగా తనకు పింఛను మంజూరు చెయ్యమని విజ్ఞప్తి చేశాడు. దాంతో అతన్ని అతి కిరాతకంగా రక్తసిక్తమయ్యేలా కొట్టి పడేసిన సంఘటన ఆగ్రామంలో చోటుచేసుకున్నట్లు సమాచారం అందింది.