పిరికి భర్త వద్దన్న పెళ్లి కూతురు.

పాట్నా:
కాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా తనకీ వివాహం వద్దని చెప్పేసింది ఓ పెళ్లి కూతురు.. పిడుగు పడ్డందుకు వరుడు భయపడిపోవడమే అందుకు కారణమైంది. ఆ తరువాత కూడా ఆ వరుడు విచిత్రంగా ప్రవర్తించాడని వధువు చెప్పింది. ఇంతగా భయపడిపోయే వాడిని పెళ్లి చేసుకోబోనని అందరి ముందూ చెప్పేసింది. బీహార్‌లోని సర్నా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అతడిని వధువు వద్దనందుకు పెళ్లి కొడుకు బంధువులు వాగ్వివాదానికి దిగారు. ఇరు వర్గాల వారి మధ్య మరింత గొడవ చెలరేగడంతో వధువు తరఫు బంధువులు రెచ్చిపోయి దాడికి దిగారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వధువు తరఫు ముగ్గురు బంధువులను అరెస్ట్‌ చేశారు.