పిల్ల కాంగ్రెస్ గా మారిన టీడీపీ. – కేటీఆర్.

హైదరాబాద్:
టీడీపీ పిల్ల కాంగ్రెస్ గా మారిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం గా అధికార దుర్వినియోగాయానికి తెరలేపార ని ఆరోపించారు.ఎపి పోలీస్ యంత్రాంగాన్ని కుట్రలకు వాడుకుంటున్నారని అన్నారు.
సర్వేల పేరుతో, డబ్బుల పంపిణీకి తెలంగాణ లో ఇంటెలిజెన్స్ అధికారులను వాడుతున్నారని ఆరోపించారు.ధర్మపురిలో ముగ్గురు ఎపి పోలీసులు దొరికిపోయారని తెలిపారు. అరగంటలోనే ఎపి ఇంటెలిజెన్స్ ఏసీపీ బోస్ ఫోన్ చేసి విడిపించే ప్రయత్నం చేశారని అన్నారు.
తెలుగుయువత రమణ సన్నిహితుడు అనిల్ వాహనంలో 50లక్షలు దొరికాయన్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ నేతలు విచ్చలవిడిగా డబ్బు పంపిణీకి సిద్ధపడ్డారని ఆరోపించారు.
ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసామని తెలిపారు. ఆంధ్ర పోలీస్ యంత్రాలంగాన్ని తెలంగాణ ధర్మపురిలో ఎం పని అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రతి నాయకుడి వాహనం తనిఖీ చేయాల్సిందేనని చెప్పారు.ఎపి సొమ్ముతో టీవీ చానల్స్ లో ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.500 కోట్లతో రాహుల్ తో ఒప్పందం కుదుర్చుకున్నారని కేటీఆర్ ఆరోపించారు.ఎలక్షన్ కమిషన్ వెంటనే డబ్బు పంపిణీకి అడ్డుకట్ట వేయాలని కోరారు.

ఉత్తమ్ కుమార్ గత ఎన్నికల్లో 3 కోట్లు కాల్చుకున్నారని చెప్పారు.మినిష్టర్ క్వార్టర్స్ లో టీటీడీపీ రమణ కి ఎమ్ పని అని ప్రశ్నించారు.
డిఎస్పీ బోస్, ఏపీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ రేవంత్ రెడ్డి కి టచ్ లో ఉన్నారని ఆయన ఆరోపించారు.
ఎలక్షన్ కమిషన్ కు ఆధారాలతో ఫిర్యాదు చేసామని తెలిపారు.అరాచకాలకు తెరలేపుదామంటే టిఆర్ఎస్ శ్రేణులు చేతులు కట్టుకుని ఉండరని హెచ్చరించారు.దొంగల ఫోన్ లు ట్యాప్ చేయాల్సిన ఖర్మ లేదన్నారు. ఆపద్ధర్మ ప్రభుత్వం,పోలీస్ యంత్రాంగం ఎన్నికల సంఘం కిందే పని చేస్తుందని గుర్తు చేశారు.”ఉమ్మడి ఏపీ లో పాలకులు తెలంగాణ లోని కులాల ఆత్మాభిమానాన్ని కూడా దెబ్బ తీశారు.

తెలంగాణ వచ్చాక అన్ని కులాలకు ,ప్రముఖులు ,మహానుభావులకు ప్రభుత్వం గౌరవం పెంచేలా వ్యవహరించింది. కెసిఆర్ అందరి ఆత్మాభిమానాన్ని పెంచే పనులు చేశారు. ఎన్టీఆర్ రాజకీయాలకు రాక ముందు తెలుగు వారిని మదరాసీలు అనే వారు. తెలంగాణ రాక ముందు తెలంగాణ గురించి ప్రపంచానికి తెలియదు. కెసిఆర్ తెలంగాణ పేరు ను ప్రపంచానికి చాటి చెప్పారు. తెలంగాణ రాక ముందు సినిమాల్లో విలన్లకు తెలంగాణ యాస పెట్టే వారు. ఇపుడు హీరో లకు తెలంగాణ యాస పెడుతున్నారు. ఉత్తమ్ నన్ను బచ్చా అంటున్నారు.
నేను బచ్చా ను అయితే రాహుల్ గాంధీ బచ్చా కాదా ?నేను ఉద్యమం లో జైలు కెళ్లాను .రాహుల్ ఎప్పుడయినా జైలు కెళ్లారా ?నాకు ఉత్తమ్ తెలివి లేదని అన్నారు. నిజమే ఉత్తమ్ లాగా కారు ఇంజిన్లో 3 కోట్ల రూపాయలు తగల బెట్టే తెలివి లేదు. కొందరు దొంగల్లా 50 లక్షల రూపాయలు సంచి లో తీసుకు పోయే తెలివి లేదు. ఉత్తమ్ అన్నట్టు నాకు పొగరు కచ్చితంగా ఉంది. తెలంగాణ లో పుట్టిన వారికీ రోషం ,పొగరు ఉంటాయి. కెసిఆర్ ను మళ్ళీ గెలిపించేందుకు లక్ష కారణాలు ఉన్నాయి.
కెసిఆర్ ను దించేందుకు ఒక్క కారణమైనా చెప్పలేరు. కెసిఆర్ ను దించాలని కేవలం మహా కూటమి నేతలంటున్నారు .ప్రజలు కెసిఆర్ ప్రభుత్వమే రావాలని బలంగా కోరుకుంటున్నారు. తెలంగాణ అంతటా శబ్ద విప్లవమే ఉంది. డిసెంబర్ 11 న విపక్షాల గూబ గుయ్యి మనే తీర్పు వస్తుంది కాంగ్రెస్ లో 40 మంది సీఎం అభ్యర్థులున్నారు.
ఉత్తమ్ శత కోటి లింగాల్లో ఒక బోడి లింగం.

టీఆర్ఎస్  కు ఓటేస్తే కెసిఆర్ సీఎం అవుతారు .మహా కూటమి కి ఓటేస్తే ఎవరు సీఎం అవుతారు ?
అమేథీ లో మున్సిపాలిటీ ని గెలిపించుకోలేని రాహుల్ తెలంగాణ లో పార్టీ ని గెలిపిస్తారు.
కాంగ్రెస్ టీడీపీ ల పొత్తుకు పునాది లేదు
ఎన్టీఆర్ కు చంద్రబాబు రెండో సారి వెన్ను పోటు పొడిచారు.” అని కేటీఆర్ మండి పడ్డారు.

…కెసిఆర్ గెలిస్తే తెలంగాణ మరింత అభివృద్ధి అవుతుంది …మహా కూటమి గెలిస్తే తెలంగాణ సంపద అమరావతి కి తరలుతుంది
…ఓటర్లు ఆలోచించి విజ్ఞతతో ఓటెయ్యాలి
…చంద్రబాబు ఆటలు తెలంగాణ లో సాగవు
…60 యేండ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో జరిగింది
…అభివృద్ధి చేసే ప్రభుత్వం కావాలా ?అంధకారంలో నెట్టే ప్రభుత్వం కావాలా ?
…కెసిఆర్ కుటుంబం శాశ్వతంగా తెలంగాణ ప్రయోజనాల కోసమే పని చేస్తుంది