పుట్టింటికి చేరడం ఆనందంగా వుంది. – మాజీ సి.ఎం.కిరణ్.

ఢిల్లీ;
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉన్నట్టు ఎపి కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఊమెన్ చాందీ అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి చేరికను ఆయన స్వాగతించారు. ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లోకి మంచి పనులు చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు కిరణ్ కుమార్ చాలా కష్టపడ్డారని తెలిపారు.
భవిష్యత్ తో చాలా క్రియశీల పాత్ర పోషించనున్నట్టు చాందీ అన్నారు.
కిరణ కుమార్ రెడ్డి ని కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ లో చేరి కిరణ్ కండువా కప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రెండు రకాల బావోద్వేగలతో ఆయన వెళ్లారని,ఒకటి జగన్ పార్టీ పెట్టడం వలన రెండవది రాష్ట్ర విభజన జరగడం వల్ల అని రఘువీరా విశ్లేషించారు.
కాంగ్రెస్ వాళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగకుండా పోరాటం చేసిన వారు చాలా మంది ఉన్నారని చెప్పారు. భావోద్వేగం తో పార్టీ ని వదిలి వెళ్ళిన వారిని తిరిగి ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఇచ్చిన హామీలు ప్రత్యేక హోదా కాంగ్రెస్ మాత్రమే ఇవ్వగలదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్వ వైభగ్వము తతీసుకొని రావడానికి విశ్వాసంతో పని చేస్తామన్నారు. కిరణ్ కుమార్ ది కాంగ్రెస్ కుటుంబం అని రఘువీరా తెలిపారు. తిరిగి కాంగ్రెస్ లోకి రావడానికి ప్రతి ఒక్కరు చాలా ఉత్సాహంగా ఉన్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ కుటుంబం లోకి రావడం తనకు చాలా సంతోషంగా ఉందని కిరణ్ చెప్పారు. రాజీనామా చేసి నేను కాంగ్రెస్ నుంచి దూరంగా వెళ్లలేదన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీ వల్లనే మంచి గుర్తింపు వచ్చిందన్నారు. రాహూల్ గాంధీ నాయకత్వం లో కష్టపడి పని చేస్తానని తెలిపారుఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరగలేదన్నారు. ప్రత్యేక హోదా, ప్యాకేజి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వస్తాయని మాజీ సి.ఎం.తెలిపారు. బీజేపీ 4 సంవత్సరాలు నుంచి విబజన చట్టం లో ఇచ్చిన హామీలు నిలుబెట్టుకోలేక పోయారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారులు లోకి వస్తే అన్ని హామీలు నేరావేరుస్తామని తెలిపారు.