పుట్టుకతో పౌరసత్వం రద్దు చేస్తా : ట్రంప్

వాషింగ్టన్:
అమెరికాలోనే పిల్లల్ని కనాలనుకుంటున్న భారతీయ దంపతులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇవ్వబోతున్నారు. పౌరసత్వ నిబంధనలను సమూలంగా మార్చే యోచనలో ఉన్న ట్రంప్, ఇన్నాళ్లుగా అమెరికాలో జన్మించిన వారికి అమెరికా పౌరసత్వం ఇచ్చే నిబంధనను మార్చాలని భావిస్తున్నట్టు చెప్పారు. ప్రపంచంలో ఇలాంటి పౌరసత్వం ఇస్తున్న దేశం అమెరికా మాత్రమేనని.. హాస్యాస్పదమైన ఈ చట్టానికి ముగింపు పలకాల్సి ఉందన్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తో జన్మహక్కు పౌరసత్వాన్ని మార్చవచ్చని రాజ్యాంగ నిపుణులు సలహా ఇచ్చినట్టు ట్రంప్ తెలిపారు. దీంతో అమెరికా గడ్డపై పుట్టిన పిల్లలు ఆటోమేటిగ్గా అమెరికా పౌరులుగా గుర్తింపు పొందబోరు.