హైదరాబాద్:
అల్వాల్‌లో రౌడీషీటర్ నవీన్ అరాచకం సృష్టించాడు. నెలకు రూ. 10 వేలు మామూళ్లు ఇవ్వాలంటూ షాపు యజమానిని బెదిరించాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో షాపులో పెట్రోల్ పోసి తగులబెట్టాడు. షాపులో ఎవరూ లేని సమయం చూసి తగులబెట్టేందుకు ప్రయత్నించాడు. పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నంలో రౌడీ షీటర్ నవీన్‌కి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో నవీన్‌కి గాయాలు అయ్యాయి. ఈ విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.