పెద్దపల్లిలో ‘విజయమే!! ప్రత్యర్థి శిబిరంలో కల్లోలం.

రాజీవ్, కరీంనగర్:
పాకిస్తాన్ తో క్రికెట్, పెద్దపల్లి లో పోటీ ఒక్కటే. భారతీయలు క్రికెట్ ఆడితే..పాకిస్తాన్ తోనే ఆడాలి.పులి ,జింక పొట్లాడితే పులి గెలుస్తుందని అందరికి తెలుసు. అందుకే పెద్దపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన ప్రత్యర్ధులు విజయ రమణా రావు, దాసరి మనోహరెడ్డి మద్య భీకర పోరాటం చూడాలని ఓటర్లు తహ తహ లాడుతున్నారు.
టీఆరెస్ పార్టీ అభ్యర్థి గా సిట్టింగ్ నే ఎంపిక చేశారు. మనోహర్ రెడ్డి రాష్ట్రంలో భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే. ఆలాంటి రెడ్డిపై పోటీ ఆషామాషీ కాదు.కాంగ్రెస్ అధిష్టానం వద్ద విజయరామనారావు సహా 6గురు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎవ్వరూ కూడా వంద మందిని తరలించగలిగిన శక్తి సామర్ధ్యాలు కలిగిలేరు.ఇటీవల కాంగ్రెస్ ఏర్పాటు చేసిన శక్తి యాప్ లో 500 మందిని ఎన్రోల్ చేయలేకపోయారూ.5 నెలల క్రితమే పెద్డపల్లి లో బస్ యాత్ర సందర్భంగా టికెట్ ఆషావహులు ఉత్తముకుమార్ రెడ్డి సమక్షంలోనే అనుచరులు కొట్టిన చప్పట్లు గమనించిన వారికి బలం తెలిసిపోయింది. టిక్కెట్ ఆశిస్తున్న గీట్ల సవిత, సురేష్ రెడ్డి,ఈర్ల కొమురయ్య,ధర్మయ్య కన్నా మాజీ ఎమ్మెల్యే విజయ్ కి సభలో అన్ని వైపుల నుంచి మంచి స్పందన వచ్చింది. చప్పట్లతో విజయ్ కి మద్దతు నిలిచిన తీరుకు పిసిసి అధ్యక్షుడు స్వయంగా ప్రశంసించారు .

రాష్ట్ర రాజకీయ పార్టీల సమీకరణాల నేపథ్యంలో రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆరోజు విజయ్ వెంట వెళ్లేందుకు పదివేల మంది కదలడం రాజకీయ పరిశీలకులు నివ్వెరపోయారు. అప్పటికి డీలగా ఉన్న పెద్దపల్లి కాంగ్రెసు పార్టీకి విజయ్ ‘టానిక్’ ఇచ్చారు. బస్ యాత్ర నాటి బలప్రదర్శన పార్టీలో విజయ్ కి గుర్తింపు దక్కింది. అప్పటి నుండి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం ముమ్మరం చేశారు. రోజూ రోజు పార్టీకి బలాన్ని పెంచుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గ్రామాల్లో పర్యటించిన తీరుపై పార్టీకి ఊపు పెరిగింది.టికెట్ ఖరారైన టీఆరెస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి కాంగ్రెసు అభ్యర్థి ఎంపికపై ఎదిరిచూస్తూన్నారు.విజయ్ కి టికెట్ వస్తే ఒక వుహాహం ..ఇతరులకు వస్తే మరో ఎత్తు గడకు సిద్దమవుతున్నరూ.ప్రతార్తి శిబిరాన్ని కూల్చివేతే లక్ష్యం గా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కొవర్టు లను కాంగ్రెసు శిబిరం లో పంపించారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు ఓటరు.. పార్టీలు విజయ్ కి టికెట్ లభిస్తే…కాంగ్రెసు కు గెలుపు అవకాశం ఉందని.. ఆటా …ఆసక్తికరమైన రీతిలో ఉంటుందని పెద్దపల్లిలో చర్చలు నడుస్తున్న్నాయి. పెద్డపల్లి లో టిఆర్ ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి గా విజయ్ రంగంలో దిగితే ఇద్దరి మద్య పోరు రెండు పులుల పోరుగా సాగనుంది.