పెబ్బేరు లో కొండ చిలువ.

మహబూబ్ నగర్:

పెబ్బేరు వనపర్తి రహదారి సమీపంలోని పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న పొలాల్లో రైతుకి కొండచిలువ కనిపించింది. దానితో రైతు సర్ప రక్షకుడు డా. సదాశివయ్య కు సమాచారం ఇవ్వగా ఆయన తన శిష్యులకు సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్న శరత్ గౌడ్, మహేష్, అభిరామ్ తదితరులు ఆ ప్రదేశానికి చేరుకొని సుమారు 10 అడుగుల పొడవు గల కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. దీనిని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలేస్తామని డా. సదాశివయ్య తెలిపారు. అటవీ ప్రాంతాలు నాశనం కావటం వల్లే ఇవి పొలాల్లోకి వస్తున్నాయని, అవి కనిపిస్తే చంపవద్దని తమకు సమాచారం అందజేయాలని సదాశివయ్య తెలిపారు. ఈయన ఇటీవలే వనపర్తి నుండి బదిలీ పై జడ్చర్ల కి వెళ్లినా ఆయన విద్యార్థులు సర్ప రక్షణ చేయడం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు శరత్, అభి, మహేశ్ ను ప్రజలు అభినందించారు.