పెరిగిన ఓటర్ల సంఖ్య.

హైదరాబాద్:

ముమ్మర ప్రచార కార్యక్రమాలతో నగరంలో ఓటర్ల సంఖ్య పెరిగిందన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్. ముఖ్యంగా యువత ఓటు హక్కు పొందడానికి ఎక్కువ ఆసక్తి చూపారని తెలిపారు. వచ్చే నెల 4 వరకు అభ్యంతరాలు పరిశీలించి వచ్చే నెల 8న తుది ఓటర్ లిస్ట్ చేస్తామని ప్రకటించారు. చాదర్ ఘాట్ లోని విక్టరీ ప్లే గ్రౌండ్ లో భద్రపరిచిన ఈవీయంలను దానకిషోర్ పరిశీలించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో హైదరాబాద్ ఎన్నికల అధికారి దానకిషోర్ ఈవీఎంల మొదటి విడత తనిఖీ ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి 20 రోజుల పాటు కొనసాగనున్న మొదటి విడతలో 4760 కంట్రోల్ యూనిట్స్, 6120 బ్యాలెట్ యూనిట్స్ తనిఖీ చేయనున్నట్టు ఆయన వివరించారు. ప్రతి రోజు ఈవీఎంలో 16 నమూనా ఓట్లు వేసి చెక్ చేయనున్నట్టు దానకిషోర్ చెప్పారు. ఈ నెల 28న వీవీప్యాట్స్ రానున్నట్టు తెలిపారు. నిన్నటితో క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ ముగిసింది. మొత్తం లక్షా 77 వేల దరఖాస్తులు వచ్చాయని.. వీటిని 380 బూత్ లెవల్ అధికారులు, 577 సూపర్ వైజర్లు, రెవెన్యూ అధికారులు ఇంటింటికి వెళ్లి తనిఖీ చేయనున్నట్టు చెప్పారు.