పోడు భూముల సమస్యపై అఖిలపక్షం సమావేశం.

Hyderabad:

సిర్పూర్ కాగజ్ నగర్ ఘటనకు కేసీఆర్ ప్రభుత్వంమే భద్యత వహించాలని
తెలంగాణ ప్రజాస్వామిక వేదిక డిమాండ్ చేసింది. పారెస్టు రేంజర్ అధికారి అనితపై దాడిని ఆ సంఘం ఖండించింది.
“ప్రియమైన ప్రజలారా!!.
అనాదిగా పోడు భూముల సమస్య పై ప్రభుత్వాలకు, పాలకులకు చిత్తశుద్ధి లేకపవడంతో ఆదివాసీల జీవితాలు, గిరిజనులు బ్రతుకులు చిన్నాభిన్నం అవుతున్నవి. తాజాగా సుప్రింకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడవులను, కొండలను ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న ఈ దేశ ములవాసులను నిర్వాసితులను చేసేందుకు టైగర్ జోన్లను ఏర్పాటు చేస్తోంది. మునుపెన్నడూ లేని విదంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీశాఖ అధికారులతో దాడులకు దిగుతోంది. తీరగబడితే, ప్రతిఘటిస్తే పోలీసులతో పిడి యాక్ట్ లు పెట్టించి జైళ్ల లలో నిర్బంధం చేయిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా కొలంగొంది ఆదివాసీల ఘటన హైకోర్టు మెట్లు ఎక్కిన వారికి అన్యాయమే జరిగింది. ఈ అన్యాయంలో న్యాయస్థానం కూడా భాగం అయినది.
ఇక తీర్పు లతో ప్రభుత్వం పోడు భూముల మీదకు ట్రాక్టర్లు, బోల్డోజర్లు, జేసీబీ లతో పోలీసు బలగాలతో అటవీశాఖ అధికారులను ఉసిగొల్పుతోంది.దీనితో గిరిజనుల, ఆదివాసీల జీవితాల్లో బీభత్స విధ్వంసం జరగబోతోంది. నేడు తెలంగాణలో ఏటూరునాగారం ఏజెన్సీ, ఇల్లందు ,ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మొత్తంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 5 వ షెడ్యూల్లోని ప్రాంతాల మొత్తం ఒక అభద్రతా భావముతో ఎపుడు మా కొంప, గోడు యేమి కానున్నాయోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు.
తాజాగా ఇవాళ సిర్పూర్ కాగజ్ నగర్ లో అటవీ అధికారులపై పోడు భూముల రైతుల విత్తనాలు నాటుకున్న భూముల మీదకు ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు అటవీశాఖ అధికారులను, పోలీసులను ట్రాక్టర్లతో దున్నించడానికి పంపడము దానితో రైతులు తిరగబడటం స్థానిక ఎమ్మెల్యే కోనేరు కొనప్ప (టిఆర్ఎస్)సోదరుడు జడ్పీటీసీ, జెడ్పి వైస్ చైర్మైన్ కృష్ణ నేతృత్వంలో విత్తనాలు నాటిన దుక్కులను నాశనం చేసేందుకు తెచ్చిన ట్రాక్టర్ పై ఉన్న రేంజ్ ఆఫీసర్ అనితపై దాడికి దిగడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ దాడి అధికార పార్టీ ఎమ్మెల్యే సోదరుడు చేసిన ఘటనగా సమస్యను ముక్కలు ముక్కలుగా విడగొట్టి చూస్తున్నారు. సోషల్ మీడియాలో చూసినప్పుడు ప్రజా స్వామిక వాదుల్లో ఒక మహిళా అధికారి పై కట్టెలతో విపరీతంగా కొట్టడం అందరిని కలచివేస్తోంది. విచక్షణ రహిత దాడులను ఎవరూ సమర్ధించారు. కానీ పోడు సమస్యలను ప్రజాస్వామిక పద్ధతిలో ..రాజ్యాంగ బద్ధ హక్కులకు కట్టుబడకుండా అడవిపై, పోడు భూములపై ప్రభుత్వ యంత్రాంగంను ఉసిగొల్పడమే ఈ దాడులు.. ప్రతి దాడులకు కారణము అని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక TDF భావిస్తోంది.
దాడి చేస్తున్న సమయంలో 50 మంది పోలీసులు ఉన్న అడ్డుకోలేకపోవడము కూడా పలు అనుమానాలు తలెత్తుతున్నవి. పోడు భూముల సమస్యను కూడా శాంతి భద్రతల సమస్యగా మార్చి ఒక నిరంకుశ స్థాపనకు పునాదులు వేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్రకు తెర లేపినట్టు అర్థమౌతుంది.
మౌలిక సమస్య పోడు భూముల పట్టాల సమస్యను పక్కదారి పట్టించి ఇక్కడ ఫారెస్ట్ అధికారిపై దాడిగా హైలెట్ చేసి నిజాన్ని దాచి పెట్టె కుట్ర జరుగుతున్నదని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక అభిప్రాయపడుతుంది. సిర్పూర్ ఘటనతో ఫారెస్ట్ అధికారి అనితపై దాడితో సహజంగా మీడియాలో చూసిన ప్రజలకు ఆ దాడికి పాల్పడిన వారిపై ఆగ్రహ ఆవేశాలకు గురిచేసింది. దీనిని సాకుగా తీసుకొని కేసీఆర్ ప్రభుత్వం నిర్బంధ కోరలకు మరింత పదును పెట్టేందుకు ఉపయోగించుకుంటుంది.
ఈ సందర్భంగా ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు సిర్పూర్ కాగజ్ నగర్ పోడు భూముల సమస్య సందర్భంగా పారెస్టు అధికారి పై జరిగిన దాడి ఘటన పట్ల తీవ్రంగా స్పందించాలని కోరుతూనే పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ఒత్తిడి తేవాలని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కోరుతున్నది. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్రాల స్వభావాన్ని, కుట్రలను పసిగట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము..ఈ పోడు భూముల సమస్య పై ప్రతిపక్ష పార్టీలు,ప్రజా సంఘాలు, ప్రజా స్వామిక వాదులు , మేధావులు ఒక అఖిలపక్షం ఏర్పడి ఆదివాసీలకు న్యాయం జరిగేలా చొరవ చేయాలని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక TDF కోరుతున్నది”.అని ప్రొ. హరగోపాల్, జైనీ మల్లయ్య గుప్తా, ప్రొ.పి ఎల్ విశ్వేశ్వర్ రావు, చిక్కుడు ప్రభాకర్, గురిజాల రవీందర్, POW సంధ్య, కోట శ్రీనివాస్, బండి దుర్గాప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు.