పోలీస్ వాట్సప్ గ్రూప్ ‘cop connect’ ను ప్రారంభించిన డీజీపీ.

హైదరాబాద్:
పోలీసు శాఖలో 63 వేల మందికి ఒకేసారి కమ్యూనికేట్ చేసే విధంగా ఈ యాప్ ఉపయోగపడుతుందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
ఈ యాప్ ద్వారా గ్రూప్ లో ఉన్న అందరికి ఒకేసారి సమాచారం అందుతుందన్నారు. కోర్ట్ కానిస్టేబుళ్లు దగ్గరి నుండి అన్ని జిల్లాలలో పనిచెసే అన్ని గ్రూప్ లు ఈ యాప్ లో అనుసంధానం చేస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 693పోలీస్ స్టేషన్ లో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు కు ఈ యాప్ ఉపయోగపడుతుంది. పోలీస్ లక్ష్య సాధనకు ఈ యాప్ ఎంత గానో ఉపయోగపడుతుంది. సేఫ్టీ,అండ్ సెక్యూరిటీ లో భాగంగా ఈ యాప్ ను రూపొందించాం. తెలంగాణ రాష్ట్రం నేర రహిత రాష్ట్రం గా చేయడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.