ప్రజాప్రయోజన వ్యాజ్యాలను విచారించనున్న సీజేఐ.

న్యూఢిల్లీ:

సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ పదవి చేపట్టగానే సీజేఐ రంజన్ గొగోయ్ సుప్రీంకోర్ట్ జడ్జిల విధులు, బాధ్యతలు తెలిపే కొత్త రోస్టర్ ను జారీ చేశారు. కొత్త రోస్టర్ ప్రకారం కేసుల సంఖ్యను అనుసరించి జడ్జిలు విచారణ చేపడతారు. స్వయంగా చీఫ్ జస్టిస్ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, ఎన్నికలకు సంబంధించిన కేసులు, కోర్టు ధిక్కారానికి సంబంధించిన అర్జీలు, సామాజిక న్యాయం, క్రిమినల్ కేసులు, రాజ్యాంగ పదవుల్లో నియామకాలు సహా పలు ఇతర అంశాల విచారణ చేపడతారు. కొత్త రోస్టర్ ప్రకారం జస్టిస్ గొగోయ్ తో పాటు జస్టిస్ మదన్ బి లోకూర్ ధర్మాసనం ఈ కేసుల విచారణ జరపనుంది. సీజేఐ విచారణకు పంపిన కేసులను మాత్రమే జస్టిస్ లోకూర్ ధర్మాసనం విచారణకు స్వీకరిస్తుంది.