ప్రతిభ కు పట్టం. పైరవీలకు చరమగీతం-మంత్రి తుమ్మల:

హైదరాబాద్:
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రతిభ కు పట్టం కడుతున్నారని ఉద్యోగ నియామకాల్లో పైరవీలకు స్థానం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.కొత్తగా ఎన్నికైన ఏఈఈ లకు ధన్యవాదాలు, మీ తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు. గతంలో అనేక అక్రమాల ద్వారా ఉద్యోగాలు పొందేవారని, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి వలన టిఎస్పీఎస్ ద్వారా ప్రతిభ కలిగిన వారు మాత్రమే ఎన్నిక అవుతున్నారని ఆయన చెప్పారు.
గతంలో అనేక అక్రమాలు జరిగాయి.ఇప్పుడు ఎక్కడ అక్రమాలకు తావులేకుండా చేస్తున్నారని అన్నారు.రహదారులు, భవనముల శాఖలో కొత్తగా TSPSC ద్వారా ఎంపికైన ఏ.ఈ.ఈ అభ్యర్థులకు నియామక పత్రాలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం అందజేశారు. ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఇఎన్సీ గణపతి రెడ్డి,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.