ప్రతి నియోజకవర్గంలో ఒక ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్. అధ్యయనానికి రేపు కర్నాటకలో పర్యటన.

హైదరాబాద్.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో వ్యవసాయ, ఉధ్యాన పంటల ప్రాసెసింగ్ యూనిట్ల అద్యనం కోసం మైసూర్ లోని సెంట్రల్ ఫుడ్ టెక్నికల్ రిసెర్చ్ ఇన్సిస్ట్యూట్ (CFTRI), పర్యటనకు ఒక బృందం మంగళవారం వెళుతోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ఆగ్రో ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి మంత్రి పొచారం అధ్యక్షతన రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఆయా ప్రాంతాలకు అనుకూలమైన, స్థానికంగా పండే పంటలకు అనుగుణంగా వ్యాల్యు ఆడెడ్ ఉత్పత్తులను తయారు చేయడానికి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ, ఉద్యాన పంటలనుండి వ్యాల్యు ఆడెడ్ ఉత్పత్తులతో పాటు, బైప్రొడక్ట్స్ తయారి, ప్యాకింగ్, ఎక్కువ కాలం మన్నిక వంటి అంశాలలో CFTRI సాంకేతిక సలహాలను, పరిజ్ఞానాన్ని అందిస్తుంది.
గుత్తా సుఖేందర్ రెడ్డి- చైర్మన్ ( రాష్ట్ర రైతు సమన్వయ సమితి ). జయేష్ రంజన్- IAS , కార్యదర్శి (పరిశ్రమల శాఖ). సి. పార్ధసారది IAS- కార్యదర్శి (వ్యవసాయ శాఖ), యం. జగన్మోహన్ IAS- కమీషనర్ (వ్యవసాయ శాఖ). యల్. వెంకట్రామిరెడ్డి- డైరెక్టర్ (ఉద్యానశాఖ), శ్రీమతి లక్ష్మీబాయి- డైరెక్టర్ (మార్కెటింగ్). కె. వనజాత, ప్రిన్సిపాల్ సైంటిస్ట్(ఉద్యాన విశ్వవిద్యాలయం), జి. అఖిల్ కుమార్ గవార్, డైరెక్టర్-(తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటి) ఈ బృందంలో సభ్యులు గా ఉన్నారు