ప్రధాని, మంత్రుల పర్యటనల ఖర్చు రూ.393 కోట్లు!!

గత ఐదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన మంత్రివర్గ సహచరుల దేశవిదేశీ పర్యటన ఖర్చు రూ. 393 కోట్లని ఒక సమాచార హక్కు ప్రశ్న ద్వారా వెల్లడైంది. మే 2014 నుంచి ప్రధానమంత్రి, ఆయన మంత్రి మండలి సభ్యుల విదేశీ పర్యటన ఖర్చులు, దేశీయ పర్యటనల ఖర్చులు తెలపాల్సిందిగా ముంబైకి చెందిన ఆర్టీఐ కార్యకర్త అనిల్ గల్గాలీ పీఎంఓకి అర్జీ పెట్టారు.

జూన్ 2014 నుంచి మోడీ విదేశీ పర్యటనలకు ఉపయోగించిన ఛార్టర్డ్ విమానాలు, వాటి నిర్వహణ, హాట్ లైన్ సౌకర్యాలకు మొత్తంగా రూ.2,021 కోట్లు ఖర్చయినట్టు మోడీ ప్రభుత్వం డిసెంబర్ 2018లో రాజ్యసభలో ప్రకటించింది. అయితే గల్గాలీ దాఖలు చేసిన ఆర్టీఐ మాత్రం ప్రధాని, ఆయన మంత్రివర్గ సహచరుల విదేశీ పర్యటనలకు రూ.263 కోట్లు, దేశీయ పర్యటనలకు రూ.48 కోట్లు ఖర్చయినట్టు వెల్లడించింది.

మంత్రుల విషయానికొస్తే విదేశీ పర్యటనలకు రూ.29 కోట్లు, దేశీయ పర్యటనలకు రూ.53 కోట్లు ఖర్చయినట్టు ఆర్టీఐ జవాబు ద్వారా తేలింది. గల్గాలీ ప్రశ్నకు సమాధానమిస్తూ పే అండ్ అకౌంట్ ఆఫీస్ ఆఫ్ ద కేబినెట్ అఫైర్స్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సతీష్ గోయల్ 2014-15 నుంచి 2018-19 వరకు ప్రధాని, మంత్రుల మొత్తం దేశ, విదేశీ పర్యటన ఖర్చులు రూ.393.58 కోట్లని చెప్పారు.

PM, Council of Ministers incurred Rs 393 crore expenditure on foreign, domestic travel in 5 years