ప్రధాని మోదీ ఛాలెంజ్‌ను స్వీకరించిన మెదక్ ఎస్పీ చందనాదీప్తి.

హైదరాబాద్ :
ప్రధానమంత్రి దేశంలోని జిల్లా ఎస్పీలకు విసిరిన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను మెదక్ జిల్లా ఎస్పీ చందనా దీప్తి స్వీకరించారు. 2012 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన చందనాదీప్తీ ప్రధాని జారీ చేసిన ఛాలెంజ్ తో మెదక్ జిల్లా పోలీసులకు తాజాగా ట్విట్టర్ ద్వార సామర్థ్యం పెంచుకోవాలని ఛాలెంజ్ జారీ చేశారు.” నా జిల్లాలోని పోలీసు అధికారులందరూ తమ సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు ప్రతీరోజూ నూతన సాంకేతికతను పెంపొందించుకోవాలి” అని ఎస్పీ చందనా దీప్తి సూచించారు.’లెర్నింగ్ న్యూ స్కిల్స్’ హాష్ ట్యాగ్ తో ఎస్పీ జిల్లాలోని పోలీసులకు ఛాలెంజ్ చేశారు. జిల్లాలోని వెయ్యిమంది పోలీసులు మెరుగ్గా పనిచేసేందుకు వీలుగా కంప్యూటర్, కొత్త సాప్ట్ వేర్, యాప్స్, సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలని ఎస్పీ కోరారు.నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ కావాలని ఎస్పీ చందనాదీప్తి పోలీసులకు సూచించారు. ముగ్గురు డీఎస్పీలు, 9 మంది ఇన్ స్పెక్టర్లు, 30 మంది ఎస్ఐలు, 35 మంది మహిళా పోలీసులు ప్రతీరోజూ కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలని కోరారు.