ప్రపంచవ్యాప్తంగా ‘ఇన్ స్టాగ్రామ్’ క్రాష్!!

న్యూఢిల్లీ:
ప్రముఖ ఫోటో, వీడియో షేరింగ్ సోషల్ మీడియా యాప్ ఇన్ స్టాగ్రామ్ కొద్దిసేపటి క్రితం క్రాష్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్ స్టాగ్రామ్ యూజర్లు తాము ఫాలో అయ్యేవారి ప్రొఫైల్స్, ఫోటోలు చూడలేకపోతున్నారు. బ్రిటిష్ కాలమానం ప్రకారం 8 గంటలకు ఈ సమస్య తలెత్తింది. యుకె, ఆస్ట్రేలియాలలో ఇన్ స్టా యూజర్లు క్రాష్ అయినట్టు ముందుగా గుర్తించారు. యూజర్లు తమ ఇన్ స్టాగ్రామ్ ఖాతా తెరిచి చూస్తే ప్రొఫైల్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి. పాత ఫీడ్ ను రిఫ్రెష్ చేయలేమని యాప్ ల మెసేజ్ వస్తోంది. ఇన్ స్టా వెబ్ వర్షన్ లోనూ ఇదే సమస్య ఎదురైనట్టు తెలుస్తోంది.ఇన్ స్టాగ్రామ్ లో తమ అకౌంట్లు సరిగా పనిచేయకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు ఆందోళన చెందుతున్నారు. వెంటనే ట్విట్టర్ లో ఇన్ స్టాలో ఎదురవుతున్న సమస్యను గురించి ట్వీట్లు చేశారు. కొందరు ఇన్ స్టాగ్రామ్ డౌన్ అయిందా? లేదా తమకే ఈ సమస్య ఎదురవుతోందా? అనే సందిగ్ధంలో పడ్డారు. ఇన్ స్టాగ్రామ్ లో ఉదయం 3.16 EDకి పలు సమస్యలు వచ్చినట్టు గుర్తించారు. చాలా మంది యూజర్లు (45%) తమకు న్యూస్ ఫీడ్ లో సమస్యలు తలెత్తినట్టు చెప్పారు. లాగిన్, వెబ్ సైట్ ఇబ్బందుల గురించి 34%, 19% మంది ఫిర్యాదు చేశారు.