ప్రమాదపుటంచున స్పీకర్,మంత్రులు, ఎమ్మెల్యేలు!!

సర్వేచేసిందెవరు? ‘జాబితా’తయారీదారెవరు?

ఇది టిఆర్ఎస్ అధినాయకత్వం వ్యూహం కూడా అయివుండవచ్చు.ఈ జాబితాలో నిజంగానే కొందరు శాసనసభ్యుల పట్ల ప్రజల్లో వ్యతిరేకత బలంగా ఉన్నది. తమకు ఈ సారి టికెట్టు వస్తుందా , రాదా అనే డోలాయమానంలో కూడా కొందరు ఉన్నారు. ఇలాంటి‘జాబితా’ వెలువడితే తమ పనితీరును సరిదిద్దుకొని పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ పట్ల ‘విధేయత’నుకొనసాగిస్తారా లేక వేరే పార్టీల వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తారా?అనే టెస్టు కూడా కావచ్చును. టికెట్టువచ్చినా,రాకపోయినా పార్టీ పట్ల విధేయతను,విశ్వాసాన్ని కొనసాగించగలిగితే భవిష్యత్తులో పార్టీనుంచి,ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు గ్యారంటీగాఉంటాయన్న‘ సందేశం’ పంపినట్టుకనిపిస్తున్నది. ‘సర్వే ఫలితాలంటూ జరుగుతున్న ప్రచారం బూటకం.మేమెలాంటి సర్వే నిర్వహించలేదు. మీడియాలో జరుగుతున్నదంతా అసత్యప్రచారం’అనిప్రగతిభవన్ ప్రతినిధి ఒకరు ఒక పత్రికావిలేకరికి శుక్రవారం వివరణ ఇచ్చారు. ‘నన్ను ముఖ్యమంత్రి కెసిఆర్ నాలుగు సందర్భాలలో ప్రశంసించారు. నా పనితీరునుఅభినందించారు.నాకెలాంటి డోకా లేదు. పని గట్టుకొని కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.టివి చానల్ లో వచ్చిన వార్తలు అవాస్తవాలు.’ అని ఒక శాసనసభ్యుడు వ్యాఖ్యానించారు.

హైదరాబాద్;
తెలంగాణ శాసనసభ స్పీకర్, ముగ్గురు మంత్రులు, ప్రభుత్వ విప్ లు  సహా పదుల సంఖ్యలో శాసనసభ్యులంతా ‘డేంజర్జోన్’లో ఉన్నారంటూ  వార్తాకథనాలు,ప్రచారం,ఊహాగానాలుతాడూ బొంగరం లేకుండా కొనసాగుతున్నవి. అసలు సర్వే జరిగిందా ?ఎవరు చేశారు ?సర్వే నివేదికలు ఎక్కడున్నాయి? పలువురుశాసనసభ్యులపనితీరు ముఖ్యమంత్రి ‘ప్రమాణాల’కు అనుగుణంగా లేదని వచ్చిన ‘రిపోర్టుల’ సారాంశం ఏమిటి? ఈ జాబితాను రూపొందించిన వారెవరు?రచన,స్క్రీన్ ప్లే , దర్శకుడుఎవరు?జాబితాలో ఉన్న శాసనసభ్యులూ, మంత్రులే‘ప్రమాదం’లో ఉన్నారా ? ‘ప్రమాదం’ లో ఉన్నప్పటికీ కొందరిని ఉద్దేశపూర్వకంగానే జాబితా నుంచి తప్పించారా?’డేంజర్ జోన్’ అంటే ఏమిటి? తుపానుకు ముందు మొదటి ప్రమాద హెచ్చరిక అనుకోవాలా?లేక చివరిహెచ్చరికా? లేదా మొత్తానికే ఆయా సెగ్మెంట్లలో ప్రత్యామ్నాయ అభ్యర్థులనునిలబెట్టక తప్పని పరిస్థితివచ్చిందా?ఇప్పటికే ప్రత్యామ్నాయ అభ్యర్థుల ఎంపిక గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నదా? ఈ జాబితాలో లేని వారంతా కెసిఆర్ పరిభాషలో ‘వజ్రాలేనా’? అధికారపార్టీలోఎం జరుగుతోంది? అంతాసవ్యంగా,సజావుగాఉందనుకుంటున్న సమయంలో, ముఖ్యమంత్రి కెసిఆర్ ‘టార్గెట్ 100’  సీట్లను అవలీలగాకొల్లగోట్టవచ్చుననుకుంటున్న దశలో ఒక్కసారిగా ఈ‘కల్లోల’ పరిస్థితులకుకారకులెవరు?ఇది కల్పితమా ?ఎవరైనాసృష్టించారా?పత్రికల్లోనూ, ఒకటివి. న్యూస్ చానల్లో శాసనసభ్యుల‘ జాతకాలు’ బట్టబయలవుతుండగా అధికార పక్షం నుంచి స్పందన ఎందుకు లేదు?ఈ జాబితాలను పార్టీ నాయకత్వం సమర్దిస్తున్నదా?వ్యతిరేకిస్తున్నదా? కనీసం 30 మందికి పైగా శాసనసభ్యులకు కంటి మీద కునుకు లేకుండా చేయడంలో అంతరార్ధం ఏమిటి?ఆయా ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమేనా?అసలుటికెట్టే రాదా ?డేంజర్ జోన్ లో ఉన్నారంటూ విడుదలైన జాబితా వెనుక ‘గూడుపుటాణి’ ఎదో ఉన్నదన్న అనుమానాలు కలుగుతున్నవి. ముగ్గురు మంత్రులుతలసానిశ్రీనివాసయాదవ్, చందూలాల్, పద్మారావు, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి కూడా ‘జాబితా’లో ఉన్నారు. ఈ ముగ్గురు మంత్రుల పెర్ఫార్మెన్సుమాత్రమెబాగాలేదా? ఇంకొందరు కూడా ఉన్నప్పటికీ వారిని జాబితా నుంచి తొలగించారా?నిజామాబాద్ జిల్లా కు సంబంధించి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి,జుక్కల్ శాసన సభ్యుడు హనుమంతు షిండే లు సేఫ్ జోన్ లో ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.మిగతా శాసనసభ్యుల పరిస్థితి ‘అయోమయంగా’నే ఉన్నదన్నది ఆ వర్గాల కధనం.కానీ‘జాబితా’లోముగ్గురి పేర్లే బయటకు వచ్చాయి. ‘సర్వే ఫలితాలంటూ జరుగుతున్న ప్రచారం బూటకం.మేమెలాంటి సర్వే నిర్వహించలేదు. మీడియాలో జరుగుతున్నదంతా అసత్యప్రచారం’అనిప్రగతిభవన్ ప్రతినిధి ఒకరు ఒక పత్రికావిలేకరికి శుక్రవారం వివరణ ఇచ్చారు. ‘నన్నుముఖ్యమంత్రి కెసిఆర్ నాలుగు సందర్భాలలో ప్రశంసించారు. నా పనితీరునుఅభినందించారు.నాకెలాంటి డోకా లేదు. పని గట్టుకొని కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. టివి చానల్ లో వచ్చిన వార్తలు అవాస్తవాలు.’ అని ఒక శాసనసభ్యుడు వ్యాఖ్యానించారు. అయితే ఇది టిఆర్ఎస్ అధినాయకత్వం వ్యూహం కూడా అయివుండవచ్చు.ఈ జాబితాలో నిజంగానే కొందరు శాసనసభ్యుల పట్ల ప్రజల్లో వ్యతిరేకత బలంగా ఉన్నది. తమకు ఈ సారి టికెట్టు వస్తుందా , రాదా అనే డోలాయమానంలో కూడా కొందరు ఉన్నారు.ఇలాంటి‘జాబితా’ వెలువడితే తమ పనితీరును సరిదిద్దుకొని పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ పట్ల ‘విధేయత’నుకొనసాగిస్తారా లేక వేరే పార్టీల వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తారా?అనే టెస్టు కూడా కావచ్చును. టికెట్టువచ్చినా,రాకపోయినా పార్టీ పట్ల విధేయతను,విశ్వాసాన్ని కొనసాగించగలిగితే భవిష్యత్తులో పార్టీనుంచి,ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు గ్యారంటీగాఉంటాయన్న‘ సందేశం’ పంపినట్టుకనిపిస్తున్నది. సిట్టింగులకు టికెట్లు గల్లంతయ్యేవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతున్న అసెంబ్లీ నియోజకవర్గాలలోకామారెడ్డి,ఎల్లారెడ్డి,నిజామాబాద్అర్బన్,బాల్కొండ,చొప్పదండి,ఆందోల్, నర్సాపూర్,పటాన్చేరు,జనగామ,స్టేషన్ ఘన పూర్,మహబూబాబాద్,భూపాలపల్లి,ములుగు,జూబ్లీహిల్స్,చెన్నూరు,బెల్లంపల్లి,మంచిర్యాల,ఆసిఫాబాద్,ఖానాపూర్,బోథ్, దేవరకొండ,మునుగోడు,వైరా, నారాయణపేట, షాద్ నగర్,మేడ్చెల్, కూకట్ పల్లి,ఇబ్ర్హ్హహీంపట్నం,మహేశ్వరం,రాజేంద్రనగర్,చేవెళ్ల తదితర సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులోకొంతమందిని మార్చవచ్చు, కొందరి పనితీరు మెరుగుపడితే టికెట్టు ఖాయం చేయవచ్చు.

పనితీరుబాగాలేని శాసనసభ్యుల పేరుతో ఒక టివి చానల్లోవచ్చిన జాబితా ఇలా ఉంది.

మహబూబ్ నగర్;
అచ్చంపేట ; గువ్వల బాలరాజ్, మక్తల్;చిట్టెం రామ్మోహన్ రెడ్డి,మహబూబ్ నగర్ : శ్రీనివాస్ గౌడ్,నారాయణ్ పేట : రాజేందర్ రెడ్డి,

ఆదిలాబాద్;

బెల్లంపల్లి : దుర్గం చిన్నయ్య,చెన్నూరు : నల్లాలఓదెలు,మంచిర్యాల : దివాకర్ రావు,

ఖానాపూర్ : రేఖానాయక్.

కరీంనగర్;

పెద్దపల్లి : మనోహర్ రెడ్డి,రామగుండం : సోమవరపుసత్యనారాయణ.మంథని : పుట్టా మధు,

చొప్పదండి :బొడిగేశోభ,మానకొండూరు : రసమయి బాలకిషన్

ఖమ్మం :

ఇల్లందు : కోరంకనకయ్య,కొత్తగూడెం : జలగం వెంకట్రావు,అశ్వారావుపేట: తాటి వెంకటేశ్వర్లు.

మెదక్;

నారాయణ్ ఖేడ్  : భూపాల్ రెడ్డి,అందోల్ : బాబు మోహన్,సంగారెడ్డి : చింతా ప్రభాకర్

నల్గొండ;

తుంగతుర్తి : గాదరికిషోర్,దేవరకొండ : రవీంద్ర కుమార్,మునుగోడు : కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,

ఆలేరు : గొంగిడి సునీత.

నిజామాబాద్;

బోధన్ : షకీల్,కామారెడ్డి : గంప గోవర్ధన్,నిజామాబాద్ (అర్భన్) గణేష్ బిగాల.

రంగా రెడ్డి జిల్లా;

మల్కాజ్ గిరి : కనకా రెడ్డి,శేరిలింగంపల్లి: అరికే పూడి గాంధీ,చేవెళ్ల : యాదయ్య,వికారాబాద్ : సంజీవ్ రావు,మేడ్చల్ : సుధీర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం;మంచిరెడ్డి కిషన్ రెడ్డి,

మహేశ్వరం;తీగల కృష్ణారెడ్డి,రాజేందర్ నగర్;ప్రకాష్ గౌడ్,కూకట్ పల్లి;మాధవరం కృష్ణారావు.

వరంగల్;

జనగాం : ముత్తిరెడ్డియాదిరెడ్డి,భూపాలపల్లి : మధుసూదనా చారి,ములుగు : చందు లాల్,మహబూబాబాద్ : శంకర్ నాయక్