ప్రియుని ఇంటి ముందు ప్రియురాలి ధర్నా.

సిద్దిపేట:
గత 10 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నానంటూ ఓ అమ్మాయి వెంటపడ్డ ప్రియుడు వేములవాడ సన్నిధిలో గోప్యంగా పెళ్లి చేసుకుని ఆపై సంబంధం లేదంటే కుటుంబ సమేతంగా ప్రియుడి ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పారుపల్లి వీధిలో ఒక యువతి తన ప్రియుడి ఇంటి ముందు తనకు న్యాయం జరపమంటూ ధర్నా నిర్వహిస్తున్నారు. విషయంలోకి వెళితే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలానికి చెందిన సత్య అనే అమ్మాయి బంధువు తరపున తెలిసిన సిద్దిపేట పట్టణానికి చెందిన మహేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది, పెళ్లి చేసుకోమని అడిగితే మహేష్ తన చెల్లాలి పెళ్లి జరిగిన అనంతరం పెళ్లి చేసుకుంటానని చెబుతువచ్చాడు. ఇక సత్యకు తన కుటుంబీకులు తనకు వేరొకరితో వివాహం జరిపించారు. వివాహం జరిగి ఒక వారం రోజుల అనంతరం మహేష్ వల్ల విడాకులకు దారి తీసినట్లు బాధిత యువతి సత్య చెబుతుంది. విడాకుల అనంతరం నమ్మబలికే మాటలు చెబుతూ తనను గర్భవతి చేసి ఆపై సిద్దిపేట పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అబర్షన్ చేయించాడని బాధిత యువతి వెల్లడించింది. వేములవాడ సన్నిధిలో తన ప్రియుడు మహేష్ గోప్యంగా పెళ్లి చేసుకోని ఇప్పుడు నాకు ఎటువంటి సంబంధం లేదంటూ మొహం చాటేస్తున్నాడని, మహేష్ కోసం తన ఇంటి వద్దకు వెళితే మహేష్ తల్లి తల్లిదండ్రులు యువతిని బయటికి గెంటేశారంటూ ఇంటి ముందు న్యాయం కోసం పోరాడుతుంది యువతి.