ప్రేమ పేరిట దారుణం. కరీంనగర్ నడిబొడ్డున యువతి హత్య.

కరీంనగర్:
ప్రేమ పేరిట వేధిస్తూ, ఓ యువతిని దారుణంగా హత్య చేసిన ఘటన కరీంనగర్ లో సంచలనం రేపింది. కరీంనగర్ నడిబొడ్డున కలెక్టరేట్ వద్ద ఘటన జరిగింది. ఓ సైకో గా మారిన ప్రియుడు సృష్టించిన భీభత్సంతో ప్రెస్ క్లబ్ ప్రాంతంలో ఉన్నవారంతా నిశ్ఛేష్ఠులయ్యారు. కరీంనగర్ ప్రెస్ క్లబ్ కు ఎదురుగా ఉన్న మీసేవా కేంద్రం వద్ద అంతా భారీగా గుమ్మిగూడే ఉదయం. సమయంలోనే ఓ యువతిని హత్యచేసి.. తాను ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడి ఉదంతం తీవ్రకలకలం రేపింది. కరీంనగర్ లో ఊట్ల రసజ్ఞ అనే 24 ఏళ్ల యువతిని వంశీధర్ అనే యువకుడు కత్తి తో గొంతుకోసి దారుణంగా హత్యకు పాల్పడ్డాడు. గోదావరిఖని కి చెందిన రసజ్ఞ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయిింది. ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. వెనువెంటనే కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రసజ్ఞ 2 నెలల నుంచి కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఉన్న సాయి శ్రీ మీసేవ కార్యాలయంలో ట్రైనీ ఆపరేటర్ గా పనిచేస్తున్నది. నిందితుడు వంశీధర్ స్వస్థలం కాటారం మండలం శంకరంపల్లి. ప్రస్తుతం గోదావరిఖని మార్కండేయ కాలనీలో నివాసం ఉంటున్నాడు. 3 ఏళ్ల నుంచి ప్రేమవ్యవహారంలో రసజ్ఞను వేధింపులకు గురిచేస్తున్నట్టు ప్రాథమిక విచారణ ద్వారా తెలుస్తోంది. వేధింపులు భరించలేకనే రసజ్ఞ కరీంనగర్ లో ఉంటున్నది. నిందితుడు రోషిణీ అలియాస్ రసజ్ఞను గొంతు కోసిన తరువాత, తను కూడా ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు.
‘మీసేవ’ నిర్వాహకుడు దాస్యం రాజుతో పాటు కొంతమంది యువకుణ్ని అడ్డుకున్నారు. అత్యంత దారుణంగా, జన సమూహం లో ఉన్న ఓ కార్యాలయంలో కి వెళ్లి, ఓ యువకుడు, యువతిని పగ, ప్రతీకారంతో గొంతుకోసి చంపడం సభ్యసమాజమంతా తలదించుకునే సంఘటన. యువతి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.