ప్రైవేట్ బస్సులో గంజాయి, అక్రమ నగదు స్వాధీనం.

విజయవాడ;

విజయవాడ ప్రైవేట్ బస్సులో నోట్ల కట్టలు పట్టుబడటం కలకలం రేపింది. విశాఖపట్నం నుంచి బెజవాడ వచ్చిన ఓ ప్రైవేట్ బస్సులో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. సోదాలలో రూ.30 లక్షల అక్రమ నగదును తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అక్రమ నగదును చేరవేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. అదే బస్సులో విశాఖ నుంచి గంజాయి తీసుకొస్తున్న మరో ఇద్దరు కేటుగాళ్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టేశారు. చెన్నైకి చెందిన ఆ ఇద్దరి నుంచి 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు.