ప్లీజ్ అమ్మా….ప్లీజ్ నాన్న! స్మార్ట్ ఫోన్ వదిలేయండి: ప్రపంచాన్ని కదిలిస్తోన్న చిన్నారుల ర్యాలీ.

హాంబర్గ్:
చిన్నా, పెద్ద వయస్సుతో తేడా లేకుండా సోషల్ మీడియాకు బానిసలైపోతున్నారు. ఇంట్లోని చిన్నపిల్లలను కూడా పట్టించుకోకుండా కొందరు తల్లిదండ్రులు సోషల్ మీడియాలో మునిగిపోతున్నారు. నాన్నతో సరదగా నాలుగు కబుర్లు చెబుదామన్న కుదరదు… అమ్మతో సమయం గడపాలన్నా కుదరదు. తల్లిదండ్రులిద్దరూ సోషల్ మీడియాకు బానిసలైపోవడంతో తన భాధ ఎవరితో చెప్పుకోలేక ఏడేళ్ల పిల్లాడు ఎమిల్…. తనలాగే ఇబ్బందిపడుతున్న 150 మంది చిన్నారులను వెంటేసుకుని జర్మనీలోని హంబర్గ్‌ లో నిరసన ప్రదర్శన చేపట్టాడు. మేమిక్కడే ఉన్నాం… నాతో ఆడండి.. స్మార్ట్ ఫోన్లతో కాదు అంటూ పిల్లలు చేసిన నినాదాలతో వీధులన్నీ హోరెత్తాయి. సెప్టెంబర్-8న జరిగిన ఈ ఉద్యమానికి పెద్దలు కూడా సహకరించారు. ఈ నిరసన ప్రదర్శనలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఎమిల్‌ పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురుపిస్తున్నారు. ఈ ప్రదర్శనతోనైనా తల్లిదండ్రుల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్టు చిన్నారి ఎమిల్ తెలిపాడు.పైలట్లు కూడా సోషల్ మీడియాకు బానిసలయ్యారని, 2013 ఫతోల్ ఎయిర్ క్రాష్ కూడా ఇదే కారణమని రెండు రోజుల క్రితం ఎయిర్ చీఫ్ తెలిపారు. కొన్నిరోజుల క్రితం స్మార్ట్ ఫోన్ లో లీనమైపోయిన తండ్రితో మాట్డాడానికి చాలా సేపు ప్రయత్నించిన ఓ చిన్నారి….చివరికి తండ్రి ఫోన్ ని సముద్రంలో పడేసింది.