ఫిరాయింపులపై స్పీకర్, మండలి చైర్మన్ కు హైకోర్టు నోటీసులు!!


Hyderabad:

శాసన మండలిలో కాంగ్రెస్ ను trs లో విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో మంగళవారం విచారణ జరిగింది.
శాసన మండలి చైర్మన్, కార్యదర్శి, ఎన్నికల కమిషన్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Trs లో విలినమైన mlc లు ప్రభాకర్ రావు, దామోదర్ రెడ్డి, సంతోష్ కుమార్, ఆకుల లలితకు కూడా హైకోర్టు నోటీసులు పంపింది.తమ వాదన విన్నాకే విలీనం పై స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని గతంలో భట్టి, ఉత్తమ్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు నోటీసులు జారీ చేయడం విశేషము.
స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, ఈసీకి నోటీసులు జారీ అయ్యాయి.ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, చిరుమర్ధి లింగయ్య, హరిప్రియ, ఉపేందర్ రెడ్డి, సబిత, రేగా కాంతారావు, ఆత్రం సక్కు, హర్షవర్ధన్ రెడ్డి, వనమా వెంకటేశ్వర రావు, సురేందర్ రెడ్డి లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.రెండు కేసులను నాలుగు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.విలీనం చేస్తూ స్పీకర్ జారీ చేసిన బులెటిన్ రద్దు చేయాలని తాజాగా భట్టి, ఉత్తమ్ దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం విచారణ జరుపుతామన్న హైకోర్టు.