ఫిరాయింపుల అప్రతిష్ఠ

గతంలో ఉద్యమ సమయంలో చేసినట్లు ఫిరాయింపుదారులతో రాజీనామా చేయించి తిరిగి ఎన్నిక చేయించుకుని ఉంటే కేసీఆర్ కు ఆ అప్రతిష్ఠ ఉండేది కాదు. రాజకీయ సుస్థిరత కోసం పునరేకీకరణ జరిగిందంటూ సమర్ధించుకునే ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వకపోవచ్చును. కానీ అది విలువలతో కూడినది కాదు. 2014 ఎన్నికల్లో తెలంగాణా పోరాట యోధునిగా తెలంగాణా ప్రజలు కెసిఆర్ కు ‘ డిస్టింక్షన్’ మార్కులు ఇవ్వలేదు. 63 స్థానాల దగ్గరే మెజారిటీ ఆగిపోయింది. . కేబినేట్ లో మహిళలకు ప్రాతినిధ్యం లేకపోయినా తన మాటకు ఎదురులేనట్టు భావిస్తున్నందున కెసిఆర్ ను సొంత పార్టీ లో ప్రశించే వారు లేరు. భవిష్యత్తులో ఏ ఎన్నిక జరిగినా విపక్షాల వైపున గెలుపు గుర్రాలే లేకుండా చేయాలన్నది కెసిఆర్ ఎజండా. 119 నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలన్నీటిఆర్ఎస్ శిబిరంలో ఉండాలన్నది ఆయన వ్యూహం.


హైదరాబాద్:
పరిపాలనా పరమైన విజయాల గురించి ప్రభుత్వం, దాని అనుబంధ మీడియా సంస్థలు,వందిమాగధులు, భజనపరులు ఎంత గొప్పగా చెప్పుకున్నా ఫిరాయింపుల అప్రతిష్ఠ కెసిఆర్ ను వెంటాడుతుంది. పర పార్టీలను,ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం వల్ల సొంత పార్టీ ఎట్లా పటిష్టమవుతుందో ముఖ్యమంత్రి కెసిఆర్ కు మాత్రమే తెలియాలి. రాజకీయ చదరంగంలో అదొక గొప్ప చాణక్య వ్యూహంగా ఆయన భావిస్తునట్లున్నది. అనైతిక ఫిరాయింపులు, రాజీనామాలు చేయించకుండా కథ నడపడం, చట్టవిరుద్ధమే కాదు. నైతిక విరుద్ధం కూడా. ఏకంగా బీఎస్పీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ,టీడీపీలను విలీనం చేసుకున్నామని, తద్వారా దేశంలోనే చరిత్ర సృష్టించామని కేసీఆర్ కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి కానీ సంబరపడవచ్చు. కానీ దాని వెనుక ఉన్న చీకటి కోణం వారిని వెంటాడుతూనే ఉంటుంది. గతంలో ఉద్యమ సమయంలో చేసినట్లు ఫిరాయింపుదారులతో రాజీనామా చేయించి తిరిగి ఎన్నిక చేయించుకుని ఉంటే కేసీఆర్ కు ఆ అప్రతిష్ఠ ఉండేది కాదు. రాజకీయ సుస్థిరత కోసం పునరేకీకరణ జరిగిందంటూ సమర్ధించుకునే ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వకపోవచ్చును. అది విలువలతో కూడినది కాదు. 2014 ఎన్నికల్లో తెలంగాణా పోరాట యోధునిగా తెలంగాణా ప్రజలు కెసిఆర్ కు ‘ డిస్టింక్షన్’ మార్కులు ఇవ్వలేదు. 63 స్థానాల దగ్గరే మెజారిటీ ఆగిపోయింది. టిడిపి తరపున గెలిచిన 15 మంది శాసనసభ్యుల్లో 12 మంది టిఆర్ఎస్ లో చేరిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ వైపు కెసిఆర్ తన దృష్టిని సారించారు. కాంగ్రెస్ తరపున గెలిచిన 22 మంది సభ్యుల్లో ఆరుమంది ఎంఎల్ఏలు టిఆర్ఎస్ లో చేరారు. పరిపాలనపై ఆయన సంపూర్ణంగా పట్టు సాధించారు. రైతులు, మహిళలు, ఇతర వర్గాలను లక్ష్యంగా చేసుకొని పలు పధకాలను సంధించి వదులుతున్నారు. భవిష్యత్తులో ఏ ఎన్నిక జరిగినా విపక్షాల వైపున గెలుపు గుర్రాలే లేకుండా చేయాలన్నది కెసిఆర్ ఎజండా. 119 నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలన్నీటిఆర్ఎస్ శిబిరంలో ఉండాలన్నది ఆయన వ్యూహం. 2019 ఎన్నికలు సమీపిస్తున్న వేళ‌ రాజకీయ పార్టీలు తమ, తమ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడం సహజం. రాజకీయంగా చూస్తే ఏ ఎన్నిక జరిగినా టీఆర్ఎస్ దే గెలుపుగా తెలంగాణ రాష్ట్ర సమితి రికార్డు సృష్టించింది. ఇంతవరకు జరిగిన ఉప ఎన్నికలన్నిటిలో ఆ పార్టీ గెలవడం ద్వారా తనకు తిరుగులేదన్నట్లుగా వాతావరణం ఏర్పరచుకుంది. అసలు పెద్దగా ఉనికేలేని హైదరాబాద్ లో ఏకంగా 99 డివిజన్ లను గెలుచుకోవడం టీఆర్ఎస్ ప్రస్థానంలో మలుపు.కాగా అటు ఆంధ్రప్రదేశ్ లోనూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది శాసన సభ్యులు పార్టీ ఫిరాయించారు. నిరంతరం నీతులు,ప్రజాస్వామిక విలువలను గురించి మాట్లాడే ఏ.పి.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఫిరాయింపులను ప్రోత్సహించారు.4 గురికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ప్రతిపక్ష పార్టీ వైసిపి నుంచి అధికార పారేతీలోకి ఫిరాయించిన వారిపై నరహత వేటు వేయాలంటూ దాఖలైన కేసు ఉమ్మడి హైకోర్టులో నడుస్తోంది.నలుగురు మంత్రులు సహా 19 మంది పార్టీ ఫిరాయింపులపై ఏ.పి.శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు వైసిపి ఫిర్యాదు చేసినా ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదు.ఇలాంటి ఫిర్యాదులపై తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి వైఖరి కూడా యధాతధం.స్పీకర్ లకు సంక్రమించిన విచాక్షణాధికారాలతో ఫిరాయింపుదారులు ఎలాంటి భయం లేకుండా ఉన్నారు.1980 లలో ఫిరాయింపులు ఇంకా ఉధృతంగా సాగాయి. దాంతో వాటి అడ్డుకట్ట వేయడానికి రాజ్యాంగంలో 10వ షెడ్యూలును చేర్చారు.52 వ సవరణ చట్టం ద్వారా 1985లో ఈ షెడ్యూలు అమల్లోకి వచ్చింది.అయితే పార్టీ ఫిరాయించిన సభ్యులపై చర్యలు తీసుకోవడం స్పీకర్ నిర్ణయంపై ఆధార పడి ఉంటుంది.రకరకాల కారణాలు చూపుతూ స్పీకర్ తన నిర్ణయాలను వాయిదా వేస్తూ పోతుంటారు.గతంలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి హయాంలోనూ ఇలాంటి ఫిరాయింపుల వ్యవహారాన్ని చూశాం.