ఫిర్యాదులపై తక్షణ స్పందన. దర్యాప్తు.

ఖమ్మం:
బాధితుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని అడిషనల్ డిసిపి సురేష్ కుమార్ పోలీసులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ‘ప్రజాదివస్’ కార్యక్రమాన్ని అడిషనల్ డిసిపి ఆద్వర్యంలో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగింది. జిల్లా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితులు ఫిర్యాదు పరిశీలించిన అడిషనల్ డీసిపి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశించారు. ప్రధానంగా బాధిత ఫిర్యాదుదారులు ముందుగా స్ధానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే పై అధికారులను సంప్రదించాలని సూచించారు .
అధికంగా కుటుంబ, వ్యక్తిగత సమస్యలతో పాటు భూముల అక్రమించారని, ఆర్ధిక లావాదేవీలు , భార్యభర్తల సమస్యలపై వచ్చిన బాధితుల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన అడిషనల్ డీసిపి చట్టపరమైన చర్యలు తీసుకొవాలని అధికారులకు ఆదేశించారు.