‘ఫ్రంట్’ @ 100డేస్. విరామమా! విరమణా?

జాతీయ రాజకీయాల్లో కెసిఆర్ నిర్వహించే క్రియాశీల పాత్ర పై సందేహాలు, చర్చలు పక్కనబెడితే తన కుమారుడు కేటిఆర్ ను ముఖ్యమంత్రి ని చేయడం కోసమే ‘ ఫ్రంట్’ కు రూపకల్పన చేశారన్న విమర్శలు పార్టీలోనూ, వెలుపలా ఉన్నవి. ఆ విమర్శలను బలోపేతం చేస్తూ ‘కాబోయేసి.ఎం.కేటిఆర్’ శీర్షికనమార్చి 5 న కెసిఆర్ ‘మిత్రుని’ పత్రికలో ఒక వార్తా కథనం అచ్చయ్యింది.ఇది కాకతాళీయంగా విలేకరి రాసిన వార్త కాదని అందరూ అనుకుంటున్నారు.కేటిఆర్మినహాముఖ్యమంత్రి గా ‘వేరే’ ఎవరికీ అవకాశం లేదనే సంకేతాలు బహిరంగంగా ఇవ్వడానికే ఈ కధనాన్ని సంధించి వదిలారు. ధిల్లీ రాజకీయాలపై కెసిఆర్  ఆసక్తి చూపిన 48 గంటల్లో ఈ వార్త రావడం వెనుక ఆంతర్యం కనుక్కోవడం పెద్ద కష్టం కాదు.అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో కెసిఆర్ తర్వాత ప్రాధాన్యం కేటిఆర్కే ఉన్నది. ఈ ప్రాధాన్యం క్రమంగాబలపడుతున్నది.తన వారసునిగా కుమారుడ్ని రంగంలోకి దింపడానికి తగిన‘భూమిక’ను కెసిఆర్ సిద్ధం చేస్తున్నారని, అందులోభాగంగానే ఒక పద్ధతి ప్రకారం పార్టీ నాయకులను,ముఖ్యంగా మంత్రులు,పార్లమెంటు,శాసనసభ్యులను మానసికంగా తయారు చేస్తున్నారని తెలుస్తోంది.

హైదరాబాద్;
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ ‘ఫెడరల్ ఫ్రంట్’ లేదా‘ప్రజల ఫ్రంట్’ నిర్మాణానికి పూనుకొని మూడు నెలలు గడిచాయి. కానీ ‘ఫ్రంట్’ కార్యకలాపాలలో కదలిక లేదు. పురోగమనంలేదు.ఫ్రంట్ నిర్మాణ పనుల్లో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని ప్రకటించిన సమావేశాల జాడ లేదు.డిల్లీ, కోల్ కత, చెన్నై,ముంబయ్, హైదరాబాద్వంటి నగరాల్లో వివిధ రంగాలకు చెందిన నిపుణులు,మేధావులు, నిష్ణాతులు, ఆల్ ఇండియా సర్వీసెస్ కు చెందినఅధికారులు,వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులతోసమాలోచనలు, సదస్సులు పెడతామని, ఇందుకు గాను కొందరు నాయకులను సమన్వయకర్తలుగా కూడా నియమిస్తున్నట్టు కెసిఆర్ ప్రకటించారు.ఆ సమాలోచనల ఊసు లేదు.తమిళనాడు, పశ్చిమబెంగాల్,కర్నాటక తర్వాత కెసిఆర్ పర్యటనలకు ‘బ్రేకు’ పడింది.తాత్కాలికంగా ఈ ఫ్రంట్ వ్యవహారాలకు కెసిఆర్ ‘విరామం’ ప్రకటించారా?అన్నఅంశంపైరాజకీయవర్గాలలో చర్చ జరుగుతున్నది.90 మంది టిఆర్ఎస్ శాసనసభ్యులలో మూడవ వంతు మంది గెలుపు ‘అనుమానాస్పదంగా’ ఉన్నట్టు వస్తున్న కథనాలు లేదా ‘లీకులు’ కెసిఆర్ ను కలవరపరుస్తున్నవి.జాతీయ రాజకీయాల సంగతేమో గానీ ముందుగా ‘ఇల్లు’ చక్కబెట్టుకోవడానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన ఆలోచిస్తుండవచ్చు.జాతీయ రాజకీయాలలోకి వెళతానని,దేశానికి అవసరమైతే తానే నాయకత్వం వహిస్తానని మార్చి 3 న కెసిఆర్ చేసిన అలవోకగా చేసిన  ప్రకటనలేవనెత్తినప్రశ్నలు,రేపినదుమారం,దాని పర్యవసానాలపైటిఆర్ఎస్ నాయకుల్లో తర్జన భర్జన సాగుతూనే ఉన్నది.కెసిఆర్ఏమి మాట్లాడినా వీనుల విందుగా ఉంటుంది.కట్టిపడేస్తుంది.ఆయన‘స్వరపేటిక’ మహత్తు పై ఎవరికీ సందేహాలు లేవు. ‘ఫెడరల్ ఫ్రంట్’ అన్నా, జాతీయ రాజకీయాల్లో కాంగ్రెసేతర, బిజెపియేతరప్రత్యామ్నాయ కూటమి అన్నా,దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకు వస్తానని అన్నా ‘కెసిఆర్మాటకారి మాత్రమేకాదు.ఆచరణలో చేసి చూపిస్తారు’ అనినమ్మినవాళ్ళు,నమ్ముతున్న వాళ్ళు లక్షలలో ఉన్నారు.తెలంగాణలో చేపట్టిన, అమలుచేస్తున్న అనేక సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు, ఇరిగేషన్ రంగంలో కనిపిస్తున్న మెరుపులు యావద్దేశానికి‘మోడల్’ అనిప్రసంశలువెల్లువెత్తడంతో

దాన్ని ఆలంబనగా చేసుకొని, తన ‘సృజనాత్మకత’ను రంగరించి డిల్లీనిలక్ష్యంగాకెసిఆర్ చేసుకున్నట్టు ప్రజలుభావించారు.అయితేకర్నాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు,మమతాబెనర్జీ సహా బిజేపియేతర నాయకులంతా ఒకేవేదికపైకి చేరడం బహుశా కెసిఆర్ ముందస్తుగా ఊహించని పరిణామం.ఆయా ప్రాంతీయ పార్టీలన్నీ ‘యు.పి.ఏ. శిబిరం’గాఒక ప్రదర్శన నిర్వహించేందుకు ప్రయత్నించినవి.

ముఖ్యమంత్రికెసిఆర్ పచ్చి అవకాశవాదిఅని,బిజెపితో ఆయన రహస్య ఒప్పందం చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి గతంలో‘అనవసరంగా’నిందించారు.కెసిఆర్, చంద్రబాబు సలహా మేరకు తాను కాంగ్రెస్ తో జతకట్టినట్టు కర్నాటక సి.ఎం.కుమారస్వామి తేల్చేశారు. స్వామి కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయం స్పష్టం చేశారు. ప్రధానమంత్రిమోదీ నిర్ణయాలను బేషరతుగాసమర్థిస్తూ వచ్చిన సి.ఎం.గా కెసిఆర్ కు గుర్తింపు వచ్చింది.ఆ గుర్తింపు ఆయనకు ఖ్యాతిని తెచ్చి పెట్టిందో,అపఖ్యాతినితీసుకువచ్చిందో విశ్లేషించవలసి ఉన్నది.నోట్ల రద్దు సహా అనేక ‘ప్రజావ్యతిరేక’ నిర్ణయాలకు కెసిఆర్ మద్దత్తుఇచ్చారు.దీనివల్లనే కెసిఆర్ పై నిందలు,అపవాదులు వస్తున్నాయి.

వరుసగా కేంద్రాన్ని బలపరిచిఇప్పుడు వ్యతిరేకం అంటే ప్రజలు నమ్ముతారా? అనే ప్రశ్న ఉంది. నోట్ల రద్దు, జీ యస్టీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు….ప్రతి సందర్భంలోనూ కెసిఆర్ బిజెపికి‘వెలుపలి’ మద్దతుదారుగాఉన్నారు.కాగాకాంగ్రెస్,బిజెపిలకు ఆల్టర్ నేటివ్ ఫ్రంట్ విషయంలో  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు  ముందు పడతారని కొంతమంది భావించారు.  అనూహ్యంగా కేసీఆర్ తెర పైకి వచ్చారు.తర్వాతజర్గిన పరిణామాలలో ‘ఫ్రంట్’ ను చంద్రబాబునాయుడు‘హైజాక్’ చేసినట్టు కనిపిస్తున్నది.100 రోజుల్లోనే ఈ పరిణామాలన్నీ వేగంగా చోటు చేసుకున్నవి. రాబోయేపదేళ్ళు కూడా తెలంగాణా రాష్ట్ర సమితికి ఎదురులేకుండా అవసరమైన వ్యూహాలను కెసిఆర్ రచించవలసి ఉందని, జాతీయ రాజకీయాలకు తొందర ఏమిటని  ఆ పార్టీ నాయకులంటున్నారు. 13ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రత్యేక తెలంగాణ కల సాకారమైంది. కానీ తెలంగాణా పోరాట యోధునిగా తెలంగాణా ప్రజలు కెసిఆర్ కు ‘ డిస్టింక్షన్’ మార్కులు ఇవ్వలేదన్న విషయాన్ని మరచిపోవద్దు. 63 స్థానాల దగ్గరేఅయన పార్టీ మెజారిటీ ఆగిపోయింది. టిడిపి తరపున గెలిచిన 15 మంది శాసనసభ్యుల్లో 12 మంది ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరిపోయారు. కాంగ్రెస్ తరపున గెలిచిన 22 మంది సభ్యుల్లో ఆరుమందిఎంఎల్ఏలు టిఆర్ఎస్ లో చేరారు.2014 ఎన్నికలలో జాతీయ స్థాయిలోబిజెపి అద్బుత విజయాన్ని నమోదు చేసింది. కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత,మోదీ మీద ఉన్న నమ్మకం ఈ విజయానికి కారణాలు. ఉత్తరప్రదేశ్, మధ్య‌ప్రదేశ్, రాజస్దాన్, గుజరాత్,మహరాష్ట్ర,బీహర్, దిల్లీ లాంటి 7 రాష్ట్రాలలో వచ్చిన ఏకపక్ష విజయాలే బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చాయి. ఆ పార్టీ సాధించిన 282స్దానాలలో201స్దానాలుఇక్కడివే. 2014 తర్వాత జరిగిన కొన్ని ఉపఎన్నికలలో బీహర్, మధ్య‌ప్రదేశ్, రాజస్దాన్, డిల్లీ లో బిజెపి  ఓడిపోయింది. గుజరాత్ లో గణ‌నీయంగా తగ్గింది. ఈ సారి బిజెపికి  దాదాపు 70-80స్దానాలుతగ్గిపోయే  అవకాశంకనిపిస్తున్నది. ఆ స్దానాలలో కాంగ్రెస్ కు విజయావకాశాలు కనిపిస్తున్నాయి.బెంగాల్, కేరళ,తమిళనాడు, ఉభ‌య తెలుగు రాష్ట్రాలలో గతానికి నేటికి బిజెపికి వచ్చే స్దానాలలో పెద్ద మార్పు ఉండదు.మిగిలిన రాష్ట్రాలలో కూడా బిజెపి కి వచ్చే స్దానాలలో పెద్దగా  మార్పు కనిపించడం లేదు. పంజాబ్ లాంటి చోట్ల కాంగ్రెస్ పుంజుకుంది.  పలు రాష్ట్రాలలో ప్రాంతీయ  పార్టీలు పుంజుకుంటున్నాయి. బెంగాల్ లో మమత, బీహర్ లో లాలూ, తమిళ నాడులో  డిఎంకే లేదా రజినీకాంత్, తెలంగాణలో కెసిఆర్, ఏపీలో  తెలుగుదేశం లేదా వైసిపి, ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ , ఉత్తరప్రదేశ్ లో  మాయావతి లేదా అఖిలేష్  కు గతంలో కన్నా ఎక్కువ స్దానాలు వస్తాయని రాజకీయ పండితులు చెబుతున్నారు. దాదాపుగా 150 స్దానాల కు పైగా ప్రాంతీయ పార్టీలకు వచ్చే అవకాశం ఉందని ఒక అంచనా. రెండుజాతీయ పార్టీలకు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఒంటరిగా ఏర్పాటు చేసే సీట్లు రాని పక్షంలో ప్రాంతీయ పార్టీల  కూటమి నిర్ణయాత్మకంగామారనున్నది. జాతీయ రాజకీయాల్లో కెసిఆర్ నిర్వహించే క్రియాశీల పాత్ర పై సందేహాలు, చర్చలు పక్కనబెడితే తన కుమారుడు కేటిఆర్ ను ముఖ్యమంత్రి ని చేయడం కోసమే ‘ ఫ్రంట్’ కు రూపకల్పన చేశారన్న విమర్శలు పార్టీలోనూ, వెలుపలా ఉన్నవి. ఆ విమర్శలను బలోపేతం చేస్తూ ‘కాబోయేసి.ఎం.కేటిఆర్’ శీర్షికన మే 5 న కెసిఆర్ ‘మిత్రుని’ పత్రికలో ఒక వార్తా కథనం అచ్చయ్యింది. ఇది కాకతాళీయంగా విలేకరి రాసిన వార్త కాదని అందరూ అనుకుంటున్నారు. కేటిఆర్మినహాముఖ్యమంత్రి గా ‘వేరే’ ఎవరికీ అవకాశం లేదనే సంకేతాలు బహిరంగంగా ఇవ్వడానికే ఈ కధనాన్ని సంధించి వదిలారు. ధిల్లీ రాజకీయాలపై కెసిఆర్  ఆసక్తి చూపిన 48 గంటల్లో ఈ వార్త రావడం వెనుక ఆంతర్యం కనుక్కోవడం పెద్ద కష్టం కాదు.అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో కెసిఆర్ తర్వాత ప్రాధాన్యం కేటిఆర్కే ఉన్నది. ఈ ప్రాధాన్యం క్రమంగాబలపడుతున్నది. తన వారసునిగా కుమారుడ్ని రంగంలోకి దింపడానికి తగిన‘భూమిక’ను కెసిఆర్ సిద్ధం చేస్తున్నారని, అందులోభాగంగానే ఒక పద్ధతి ప్రకారం పార్టీ నాయకులను,ముఖ్యంగా మంత్రులు,పార్లమెంటు,శాసనసభ్యులను మానసికంగా తయారు చేస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వస్తామని పూర్తి భరోసాతో ఉన్న కెసిఆర్, ఎన్నికల అనంతరం ‘ మిషన్కేటిఆర్’ ను చేపడతారని తెలియవచ్చింది.ఈ లోగా 2019 ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలోనూకేటిఆర్ ముఖ్య పాత్ర పోషించే అవకాశాలున్నాయంటూ వార్తలు వెలువడుతున్నాయి. సహజంగానేకేటిఆర్విధేయులకే ఈ సారి  టిక్కెట్లు లభిస్తాయనిపలువురుటిఆర్ ఎస్ శాసనసభ్యులుచెబుతున్నారు. కేటిఆర్ పట్ల విధేయతను ప్రకటించుకోవడానికి కూడా  కొందరు ఉత్సాహం చూపుతున్నారు.