బతికే మార్గం చూపాలంటున్న తెలంగాణ ఉద్యమ బాధితుడు.

ఉద్యమ కాలంలో ఎంతో ఖర్చు పెట్టిన.నా శక్తికి మించి అప్పులు చేసిన.ఆ అప్పుల్ని ఇప్పటికీ తీర్చలేకపోతున్న.నా బాధ ఎవరికీ చెప్పుకోలేను.నేను రైతు బిడ్డను.ఒక ట్రాక్టర్ కూడా నాకు ఇవ్వలేదు.నా పార్టీ, మా ఇంటి పార్టీ అని చెప్పుకుంటూ ఉంటె నన్ను పట్టించుకునే నాధుడు లేడు.నేను ఉద్యమానికి పెట్టిన ఖర్చు, ఇంతకాలం చేసిన కష్టం బూడిదపాలైంది.చివరికి నా భార్య కూడా నన్నొదిలి వెళ్ళిపోయింది.కన్న కూతురిని చదివించుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న.’

హైదరాబాద్.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, ఆర్థికంగా పూర్తిగా నష్టపోయిన బాధితులలో వరంగల్ జిల్లా కు చెందిన భీమా లక్ష్మణ మూర్తి ఒకరు.తనను అధికార పార్టీ నాయకులు పట్టించుకోకుండా తీరని అన్యాయం చేశారని ఆయన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తనకు న్యాయం చేయాలని గత నాలుగు ఏళ్లుగా సచివాలయం, ప్రగతి భవన్ చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదన్నది ఆయన ఆవేదన. ‘ప్రగతిభవన్ కు, సెక్రెటేరియట్ కు వందలసార్లు ఫోన్లు చేసిన.ఎవరూ కనికరించడం లేదు.2001 ఏప్రిల్ 10 న ఒక రూపాయి ఇచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వం తీసుకున్నా.నేను మొట్ట మొదటి ఉద్యమ కారుడ్ని.మొట్టమొదటి కార్యకర్తను.కరీంనగర్ సింహగర్జన సభకు మా ఊరినుంచి నలుగురం హాజరైనం.ముఖ్యమంత్రిని కలిస్తే రెండు నిముషాలలో నా గోడు చెప్పుకుందానుకున్నా.ముఖ్యమంత్రి కేసిఆర్ ను కలిపియ్యాలని కోరిన.ఎవరూ స్పందించలేదు.మంత్రి కేటిఆర్ ను కలవాలనుకున్న.ఆయన పి.ఏ.తిరుపతన్న కు వందల సార్లు ఫోన్ చేసిన.ఫలితం లేదు.నా బాధను ఎవరికీ చెప్పుకోవాలె. నా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలె. అధికారులు దొరకరు.నాయకులు దొరకరు.ఎవరు వింటరు.తెలంగాణ వస్తే నా జీవితం బాగుపడుతతుందనుకున్నా.నాకు ఉద్యోగం వస్తుందనుకున్న.నా కుటుంబం బాగుపడుతుందనుకున్న.ఉద్యమ కాలంలో ఎంతో ఖర్చు పెట్టిన.నా శక్తికి మించి అప్పులు చేసిన.ఆ అప్పుల్ని ఇప్పటికీ తీర్చలేకపోతున్న.నా బాధ ఎవరికీ చెప్పుకోలేను.నేను రైతు బిడ్డను.ఒక ట్రాక్టర్ కూడా నాకు ఇవ్వలేదు.నా పార్టీ, మా ఇంటి పార్టీ అని చెప్పుకుంటూ ఉంటె నన్ను పట్టించుకునే నాధుడు లేడు.నేను ఉద్యమానికి పెట్టిన ఖర్చు, ఇంతకాలం చేసిన కష్టం బూడిదపాలైంది.చివరికి నా భార్య కూడా నన్నొదిలి వెళ్ళిపోయింది.కన్న కూతురిని చదివించుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న.’ అని లక్ష్మణమూర్తి అన్నాడు.తనపై తన గ్రామ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నేరవేర్చలేక పోవడమే కాకుండా, తన జీవించే హక్కు ప్రశ్నార్థకంగా మారిందని మానహక్కుల కమిషన్ కు తెలిపాడు.. తనను, తన ప్రజలును కష్టాలు పాలు చేస్తున్న సంబంధింత అధికారులు, టిఆర్ ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరాడు.ప్రజల జీవించే హక్కును పునరుద్ధరించడానికి చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన హెచ్ఆర్సీని వేడుకున్నాడు.