‘బతుకమ్మ’ను ‘జాగృతి’ చేయదు.- ఎంపీ కవిత.

హైదరాబాద్:

ఈ సారి ‘బతుకమ్మ’ ఉత్సవాలను ‘ తెలంగాణ జాగృతి’ చేయడం లేదని ఎంపీ కవిత శుక్రవారం ప్రకటించారు.ఎన్నికల ఏడాది కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు.నాలుగేళ్ల కాలంలో విపక్షాలు చేసిన వ్యాఖ్యలు బాధపెట్టాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా తెలంగాణ జాగృతి తీసుకోలేదన్నారు. భవిష్యత్ లోనూ తీసుకోమని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ సాంసృతిక వైభవాన్ని, అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటెలా ప్రతి ఏడులాగానే ఈ ఏడు కూడా బతుకమ్మ పండుగను ఆడబిడ్డలు ఘనంగా నిర్వహించాలని జాగృతి అధ్యక్షురాలు కూడా అయిన కవిత కోరారు.