బహరేన్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.

బహేరైన్:
ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహరేన్ అధ్వర్యంలో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మనామా కర్ణాటక సోషల్ క్లబ్ లో అమరవీరులకు క్రోవ్వత్తులు వెలిగించి, పూలతో నివాళ్ళు అర్పించి, అమరులైన వీరత్యాగాలను స్మరించుకొన్ని, కేకుకట్ చేసి ఆనందోత్సాలతో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను జరుపుకొన్ని. అనంతరం ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్, లు మాట్లాడుతూ నాల్గొవ సారి కూడా బహరేన్ లో రాష్ట్ర ఆవతరణ దినోత్సవాలు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా వుంది మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, తెలంగాణ గల్ఫ్ ప్రవాసులకూ ఎలాంటి సమస్యలు వచ్చిన ఆదుకోవడానికి 50 కోట్ల నిధులతో ఎన్నారై సెల్ ను ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపి. ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్ల పాటు అన్ని రంగాల్లో తెలంగాణ ప్రాంతం వెనకబాటుకు గురైంది, అనేక ఆశలు ఆశయాలతో అమరుల త్యాగాలతో పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణను అదే కృషి, పట్టుదల, సంకల్పంతో ఉద్యమ నేత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, గత నాలుగేళ్ళుగా చేపడుతున్న సంక్షేమ పథకంలు పింఛన్లు, కళ్యాణ లక్మి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు మంచినీటి కోసం మిషన్భగీరథ, సాగునీటి కోసం మిషన్ కాకతీయ, 24 గంటల విద్యుత్, ప్రాజెక్టులనిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి పథకాలతో ఇతర రాష్ర్టాలను ఆకర్షిస్తున్నాయీ, మరియు దేశంలో ఏ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా, ఒకప్పుడు మొగులు వంకచూసిన రైతు బిడ్డలు నేడు సీఎం కేసీఆర్ సారధ్యంలో రైతును రాజుగా చేయాలని రైతు రుణమాఫీ చేసి రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో గల్ఫ్ వలసలు కూడా కొంత తగ్గే ఆవకాముంది నేడు రైతన్నలు అందరు కేసీఆర్ వంక చూస్తున్నారు దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అన్నిరంగాలను అభివృద్ధి చేస్తూ జనరంజక పాలనా కొనసాగిస్తూ.. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న సీఎం కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధులకు ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న