బాంబు బెదిరింపు. జోధ్ పూర్ విమానాశ్రయం మూసివేత.

జైపూర్:
రాజస్థాన్ లోని జోధ్ పూర్ విమానాశ్రయాన్ని పాక్షికంగా మూసేశారు. ముంబై నుంచి జోధ్ పూర్ వెళ్తున్న ఎయిరిండియా ఫ్లైట్ 645 విమానంలో బాంబు ఉందన్న బెదిరింపు కాల్ తో ఎయిర్ పోర్ట్ సిబ్బంది విమానాశ్రయాన్ని మూసేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, సీఐఎస్ఎఫ్ కమాండోలు ఎయిర్ పోర్ట్ ని తమ అధీనంలోకి తీసుకున్నారు. విమానం ల్యాండవగానే క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. విమానాశ్రయం చుట్టుపక్కల పరిసరాల్లో డాగ్ స్క్వాడ్ తో సోదాలు జరుపుతున్నారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది, నగర పోలీస్ బృందాలు జోధ్ పూర్ లో భారీ గాలింపు ఆపరేషన్ చేపట్టాయి. విమానంలోని ఆరుగురు ప్రయాణికులను సీఐఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది. వారిలో ముగ్గురిని వెంటనే విడుదల చేశారు. మిగతా ముగ్గురిని కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.