బాణాసంచా గోదాములో పేలుడు. 11 మంది సజీవ దహనం.

వరంగల్:
వరంగల్ నగరంలోని కాశీబుగ్గ కోటిలింగల దేవాలయం దగ్గర భద్రకాళీ పైర్ షాపు బాంబుల తయారి గోదంలో అగ్ని ప్రమాదం జరిగింది. 11 మంది సజీవ దహనమయ్యారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలాన్ని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీ హరి సందర్శించారు. ఈ ఘటన పై ముఖ్యమంత్రి కేసీఆర్, సి ఎల్పీ నాయకుడు జానారెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ వేర్వేరు ప్రకటనలలో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.