‘బాబు’కు తెలంగాణతో పనేమిటి? 500 కోట్లతో రంగంలో టిడిపి.-కేటిఆర్ చిట్ చాట్.

హైదరాబాద్:

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు తెలంగాణతో పనేమిటని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.ఈ ఎన్నికలు టీఆర్ఎస్ పనితీరుకు రెఫరెండం అని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దసరా తర్వాత టీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల చేస్తున్నట్టు తెలిపారు.ఏకకాలంలో ఋణమాఫీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.నిరుద్యోగ భృతి మీద కసరత్తు నడుస్తోందన్నారు.

రేవంత్, సీఎం రమేష్ , బీద మస్తాన్ రావులపై ఐటీ దాడులు జరిగీతే చంద్రబాబు స్పందించటమేంటన్నారు.టీఆరెస్ నేతల మీద ఐటీ దాడులు జరిగితే కేసీఆర్ స్పందించలేదని గుర్తు చేశారు.కోదండరాం ఇప్పటివరకు ఎన్నికలను ఎదుర్కోనందున ఆయన బలమెంతో తెలియదన్నారు.అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉండటం సర్వ సాధారణం అని, తమపై కూడా వ్యతిరేకత వుంటుందన్నారు.’ఓటుకు నోటు’ ద్వారా ఎమ్మెల్సీ గెలవాలని ప్రయత్నం చేసినట్టే ,చంద్రబాబు తెలంగాణలో 500 కోట్లు ఖర్చు పెట్టాలని చూస్తున్నాడని కేటీఆర్ నిందించారు.
ఏపీ ఇంటిలిజెన్స్ అధికార యంత్రాంగంను తెలంగాణాలో దింపాడని కేటీఆర్ ఆరోపించారు.