బాలునిపై మహిళ లైంగికదాడి.

విజయవాడ;
నగరంలో ఘోరం జరిగింది. విజయవాడలోని నున్న ప్రాంతంలో 14 ఏళ్ల బాలుడిపై ఓ మహిళ అత్యాచారయత్నానికి ఒడిగట్టింది. మహిళ లైంగిక దుశ్చర్య నుంచి తప్పించుకున్న బాలుడు తల్లికి జరిగిన దుర్మార్గం గురించి చెప్పాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఆమెపై దాడి చేశారు. నున్న పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితురాలిపై ఫోక్సో (లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ కల్పించే చట్టం) కింద  పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను అరెస్టు చేశారు. బాధిత బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.