బాల్కొండలో ప్రశాంత్ రెడ్డి ఎదురీత!!

prashath reddy

రాజ్ కుమార్, నిజామాబాద్:

బాల్కొండ మాజీ ఎమ్మెల్యే, టిఆర్ ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి ఎదురీదే పరిస్థితులు కనిపిస్తున్నవి.
సాధారణ ప్రజలు, పార్టీ కార్యకర్తల పట్ల ఆయన దురుసుగా ప్రవర్తించే తీరు, పరుషంగా మాట్లాడే పద్ధతి
ఓటర్లలో 'నెగెటివ్' వాతావరణాన్నికల్పిస్తున్నవి. గ్రామాల్లో ఇద్దరు ముగ్గురు నాయకులు మినహా
ప్రజల్లో అభిమానం సాదించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా
బరిలోకి దిగుతున్న అనిల్ బీసీ సామాజికవర్గం ప్రతినిధి కావడంతో వెనుకబడిన వర్గాలు కాంగ్రెస్ వైపు
ఆకర్షితులవుతున్నారు. వేల్పూరు మండలం మినహా మిగతా అన్ని మండలాల్లో టిఆర్ఎస్ అభ్యర్థి
అనూహ్యంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్నట్టు ఆయా ప్రాంతాల నుంచి సమాచారం
అందుతున్నది. ప్రశాంత్ రెడ్డి మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా పని చేస్తున్నారు. ఈ పథకం అమలులో
అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నందున దాని ప్రభావం కూడా ప్రశాంత్ రెడ్డి పై పడుతున్నట్టు
బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గాలంటున్నవి. పసుపు బోర్డ్ ఏర్పాటు హామీ మూలన పడడమూ
అఆయనకు మైనస్ గా మారింది. కాకతీయ కెనాల్ నీటి వివాదం, కొత్త డలాల ఏర్పాటు వ్యవహారాల్లో
చాలా గ్రామాల్లో ఆయన వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు. ప్రశాంత్ రెడ్డి కి నాయకత్వ లక్షణాల కొరత
ఉన్నట్టు టిఆర్ఎస్ కార్యకర్తలే చెబుతున్నారు.ఆయనకు వాక్చాతుర్యం లేకపోవడం ఎన్నికల్లో ప్రభావం
చూపే అవకాశాలున్నవి. గ్రామ స్థాయిలో ఎమ్మెల్యే గా పట్టు సాధించకపోగా ప్రజలతో మమేకం
కాలేకపోతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. టీ ఆర్ యస్ నుంచి రెబల్ అభ్యర్థిగా సునిల్ బరిలో ఉండటం
ప్రశాంత్ రెడ్డి విజయాకాశాలను దెబ్బతీయవచ్చునని విశ్లేషణ జరుగుతున్నది. ఎమ్మెల్యే దగ్గరకు ఏదైనా
పని కోసం కార్యకర్తలు, ప్రజలు వెళ్ళినప్పుడు దూషించేవారని నిందలున్నవి. పచ్చల్ నడుకుడ
గ్రామంలో లో చెక్ డ్యాం అడిగిన రైతులతో ఆయన దురుసుగా ప్రవర్తించిన విషయాలను కొందరు

కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. హసకోత్తూర్,చౌట్పల్లి గ్రామాల మద్య చిచ్చు పెట్టారని ఆరోపణలు
వస్తున్నాయి. 'రెంజర్ల' ను మండలంగా ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ అమలు కాకపోవడంపట్ల ఆ
ప్రాంతంలో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. బీమ్ గల్ మండలంలో బస్ డిపో పునరుద్దరణ హామీని
ఎమ్మెల్యే విస్మరించడంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొన్నది. బాల్కొండకు 'మిని స్టేడియం' మంజూరు
చేయిస్తాననిఇచ్చిన హమీని విస్మరించారని విమర్శలు వస్తున్నవి. బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం లో
ఒక్క 'డబుల్ బెడ్ రూం' కూడా నిర్మించకపోవడంతో టిఆర్ఎస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. అక్రమ
ఇసుక దందా ఆరోపణలు చాలాకాలంగా ఉన్నవి. ఇసుక అక్రమ రావాణాను నియంత్రించడంలో స్థానిక
ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి విఫలమైనట్టు ప్రతిపక్షాలు చెబుతున్నవి. ప్రశాంత్ రెడ్డికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి
కేసీఆర్ దగ్గర పలుకుబడి ఉండడంతో ఆయన అనుచరుల ఆగడాలు శృతి మించినట్టు జరుగుతున్న
ప్రచారం టిఆర్ఎస్ అభ్యర్థికి గడ్డు సమస్యగా మారిందని అంటున్నారు. నియోజకవర్గంలో పలు కాంట్రాక్ట్
లు తమ బంధువులకే కట్టబెట్టారన్నా ఆరోపణలను ప్రశాంత్ ఎదుర్కుంటున్నట్టు తెలుస్తున్నది. మైనారీటీ
లకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామని టిఆర్ఎస్ ఇచ్చిన హమీ అమలుకాకపోవడం మైనారిటీ ఓటర్లపై
ప్రభావం చూపనుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో పూర్తి కాని పనులను పూర్తి చేయడం తప్ప
,ఒక్క కొత్త పని కూడా ప్రారంభించలేదని టిఆర్ఎస్ అభ్యర్థిపై విమర్శలు ఉన్నవి. సాగునీటికోసం ఆందోళన
చేసినప్పుడు శ్రీరామ్ సాగర్ ఆయకట్టు రైతులను ఆయన అవమానించారని ప్రచారం సాగుతున్నది .