‘బిగ్ బిలియన్ డేస్’ లో 80% డిస్కౌంట్లు.

న్యూఢిల్లీ
:
ఈకామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ పండుగ సీజన్ సందర్భంగా ఇవాళ తన ఐదో బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభించింది. ఐదు రోజులు సాగే ఈ సేల్ లో టాప్ మొబైల్ బ్రాండ్స్ పై అదిరిపోయే డీల్స్ ఇస్తోంది. టీవీలు, ఎలక్ట్రానిక్ పరికరాలపై 80% వరకు, ఫ్యాష్, గృహాలంకరణ సామాగ్రి, పర్సనల్ కేర్ వంటి అనేక వస్తువులపై 90% వరకు భారీ తగ్గింపులు ఇస్తోంది. తన ప్రధాన ప్రత్యర్థి సంస్థ అమెజాన్ మాదిరిగా కాకుండా ఫ్లిప్ కార్ట్ తన డీల్స్, డిస్కౌంట్లను దశలవారీగా ఇవ్వనుంది. ఫ్యాషన్, టీవీలు, ఎలక్ట్రానిక్ పరికాలు, ఫర్నీచర్, గృహోపయోగ వస్తువులు, సౌందర్య సాధనాలు, ఆటవస్తువులు, పుస్తకాలు, స్మార్ట్ డివైసెస్, పర్సనల్ కేర్ సామాగ్రి.. ఇలా ఒక్కొక్క దానిపై విడతలవారీగా డిస్కౌంట్లు ఇస్తోంది.అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆరంభం నుంచే మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తుండగా ఫ్లిప్ కార్ట్ లో మొబైల్స్, ఎలక్ట్రానిక్ డివైసెస్ ల అమ్మకాలు అక్టోబర్ 11 నుంచి కానీ ప్రారంభం కావు. ఇవాళ ఫ్లిప్ కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్ సేల్ లో అందిస్తున్న డీల్స్ ఇలా ఉన్నాయి.

రూ.9,999 నుంచి మొదలుకొని టెలివిజన్లు:
రూ.9,299 ఆరంభ ధర నుంచి వాషింగ్ మెషీన్లు:
గూగుల్ క్రోమ్ కాస్ట్ పై 40%కి పైగా తగ్గింపు:
ప్యూమా, క్యాట్ వాక్, హుష్ పప్పీస్, యుసీబీ వంటి ప్రముఖ బ్రాండ్లతో సహా మహిళల పాదరక్షలపై 80% డిస్కౌంట్:
అన్ని బ్రాండ్ల పురుషుల దుస్తులపై కనీసం 60% తగ్గింపు:
రూ.2,999 నుంచి మొదలుకొని హోమ్ టౌన్ బెస్ట్ సెల్లర్స్:
రాయల్ ఓక్ ఫర్నీచర్ పై 70% వరకు రాయితీ:
మేకప్, సౌందర్య సామాగ్రిపై కనీసం 40% తగ్గింపు:
క్రీడా సామాగ్రిపై 70% వరకు ఆఫ్:

గత ఏడాది తరహాలోనే బిగ్ బిలియన్ డేస్ సేల్ లో పలు సులువైన చెల్లింపు ప్రత్యామ్నాయాలు అందిస్తోంది. హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసినవారికి ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నాయి. నో కాస్ట్ ఈఎంఐ, డెబిట్ కార్డ్ ఈఎంఐ, ఫ్లిప్ కార్ట్ తర్వాత చెల్లింపు, కార్డురహిత చెల్లింపు, రూ.60,000 వరకు ఫ్లిప్ కార్ట్ కార్డురహిత రుణం వంటి ఎన్నో సులువైన చెల్లింపు పద్ధతులు అందిస్తోంది. ఇవి కాకుండా ఫ్లిప్ కార్ట్ ప్రతి 8 గంటలకు అన్ని కేటగిరీల్లో కొత్త డీల్స్ ప్రకటించనుంది. అలాగే ప్రతి గంటకు ఫ్లాష్ సేల్స్ జరుపనుంది. అంటే 120 గంటల్లో 120 కొత్త డీల్స్ ఉండబోతున్నాయి. ఈ సేల్ పీరియడ్ లో గేమ్స్, కాంటెస్ట్ లలో పాల్గొనే షాపర్లు రూ. 5 కోట్ల వరకు గెలుచుకొనే అవకాశం అందజేస్తోంది.