బిజెపికి వైఎస్సార్ కాంగ్రెస్ తో ఎంగేజ్ మెంట్ : యనమల రామకృష్ణుడు.

అమరావతి:
వైసీపీ కి బిజెపితో ఎంగేజ్ మెంట్ అయిందని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.ముహూర్తం కూడా 2019గా నిర్ణయించారని యనమల గురువారం విలేకరులతో చెప్పారు.చంద్రబాబును ప్రజలకు దూరం చేయాలని బిజెపి,వైకాపా కుట్రలు చేస్తున్నట్టు యనమల ఆరోపించారు.
నమ్మకద్రోహం-కుట్ర రాజకీయాలను ప్రజలు తిప్పికొడతారని యనమల రామకృష్ణుడు అన్నారు.
బిజెపి,వైకాపా నేతలపై ఆర్ధికమంత్రి యనమల ధ్వజమెత్తారు.బెంగళూరులోప్రాంతీయపార్టీలు,వామపక్షాల నేతలతో చంద్రబాబు భేటి అయ్యారని యనమల తెలిపారు.ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై వారితో చర్చించారని యనమల చెప్పారు.ఈ చర్చలలో కాంగ్రెస్ పార్టీ లేదనేది గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.జెడి(ఎస్) ఆహ్వానం మేరకే చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వెళ్లారని ఆయన గుర్తుచేశారు.యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన భూమిక చంద్రబాబుదేనని ఆయన అన్నారు.దేవెగౌడ,ఐ.కె.గుజ్రాల్ ప్రధాని కావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని మంత్రి యనమల చెప్పారు.దేవెగౌడతో సాన్నిహిత్యం,కుమార స్వామి ఆహ్వానం మేరకే చంద్రబాబు బెంగళూరు వెళ్లారని స్పష్టం చేశారు.
అందుకే ప్రమాణ స్వీకారంలో భాగం పంచుకున్నామని చెప్పారు.
ప్రాంతీయపార్టీలు,వామ పక్షాల నేతలతో తన ఛాంబర్ లో చర్చలు జరిపారని తెలిపారు.
కాంగ్రెస్ మంత్రుల ప్రమాణానికి సోనియా,రాహుల్ హాజరయ్యారని యనమల అన్నారు.వేదికపై ఎదురైనప్పుడు అభినందించుకోవడం భారతీయ సంస్కారం అన్నారు.భారతీయ సంస్కారాన్ని కూడా తప్పు పట్టడం బిజెపి,వైసీపి సంస్కృతి అని విమర్శించారు.శాసనసభలో జాతీయగీతం వస్తుంటే సభనుంచి వెళ్లిపోవడం యడ్యూరప్ప సంస్కృతి అని యనమల విమర్శలు గుప్పించారు.కేసుల మాఫీ కోసం కేంద్రంలో పెద్దల కాళ్లు పట్టుకోవడం జగన్ సంస్కృతి అని ఆయన నిప్పులు చెరిగారు.ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఏనాడూ చంద్రబాబు వెళ్లలేదన్నారు.ఎదురైతే అభినందించడాన్ని తప్పుపట్టడం దివాలాకోరుతనంగా యనమల అన్నారు.
ఓట్లకోసం వచ్చిన కోవింద్ కాళ్లు ఏ1,ఏ2 నిందితులు పట్టుకోవడాన్ని ఏమనాలని యనమల ప్రశ్నించారు.
ఢిల్లీలో కేంద్రపెద్దల ఛాంబర్లకు జగన్ వెళ్లి కాళ్లు పట్టుకోవడాన్ని ఏమనాలని అన్నారు.బెంగళూరు ప్రమాణానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్లలేదని యనమల ప్రశ్నించారు
కర్ణాటకలో బిజెపికి పనిచేశావు కాబట్టే జెడి(ఎస్) ప్రమాణానికి జగన్ వెళ్లలేదన్నారు.
ముఖం చెల్లలేదు కాబట్టే జగన్ బెంగళూరు ప్రమాణానికి వెళ్లలేదన్నారు.
2019లో బిజెపితో పొత్తుకోసమే జగన్ బెంగళూరు ప్రమాణానికి వెళ్లలేదని యనమల స్పష్టం చేశారు.బిజెపితో తన పొత్తు చెడిపోతుందనే భయంతోనే జెడి(ఎస్) కుమారస్వామి ప్రమాణానికి జగన్ గైర్హాజరు అయినట్టు యనమల విమర్శించారు.
జాతీయ రాజకీయాలలో చంద్రబాబుకున్న ఇమేజి దేశంలో అందరికీ తెలిసిందేనన్నారు.
కాళ్లు పట్టుకునే రాజకీయాల్లో అందెవేసిన చెయ్యి జగన్మోహన్ రెడ్డిదే నని యనమల అన్నారు.
యునైటెడ్ ఫ్రంట్,నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో చంద్రబాబుదే ప్రధాన భూమిక అన్నారు.
చంద్రబాబుకున్న ఘన చరిత చూసే బెంగళూరులో అన్నిపార్టీలు గౌరవించాయని యనమల తెలిపారు.బిజెపి తప్ప ఎవరూ జగన్మోహన్ రెడ్డిని ఏ పార్టీ కలుపుకుపోదన్నారు.
కర్ణాటకలో గాలి జనార్ధన రెడ్డితో ,ఏపిలో జగన్మోహన్ రెడ్డితో బిజెపి వెళ్తోందని ఆరోపించారు.
2019 ఎన్నికల్లో 25పార్లమెంట్ స్థానాలలో టిడిపి ఘనవిజయం ఖాయమని యనమల అన్నారు.కేంద్రంలో రాబోయేది బిజేపీయేతర ప్రభుత్వమే నన్నారు.
దానికి నాందిగా బెంగళూరులో ప్రాంతీయపార్టీలు,వామపక్షాల భేటి జరిగినట్టు యనమల తెలిపారు.