బిబిసి ఇంటర్వ్యూ లో గాంధీ గురించి అంబేద్కర్ వెల్లడించిన విషయాలు.

అంబేద్కర్ :
ఆయన్ని (గాంధీజిని) నేను మొదటిసారి 1929లో కలిసాను . ఒక మిత్రుడు నన్ను కలవాలని గాంధీజిని కోరారు. అందుకే నన్ను కలువాలని వుందని గాంధీజీ నాకు ఉత్తరం వ్రాసారు అది రౌండ్ టేబుల్ సమావేశానికి కొన్ని రోజుల ముందటి మాట ఆయన మొదటి రౌండ్ టేబుల్ కి రాలేదు . రెండవ సారి ఐదు ఆరు నెలలు వున్నారు. నేను ఆయన్ని కలిసాను పూణే ఒప్పందం పై సంతకం చేసిన తరువాత నన్ను మరోసారి వచ్చి కలవలన్నారు ఆయన జైలులో వుండగా వెళ్లి కలిసాను. నేను ఒక వ్యతిరేకిగానే ఆయన్ని కలిసాను. అయన గురించి నాకు బాగా తెలుసు ఆయన రూపం తప్ప లోపల ఏమిలేదు. ఇతరులు ఆయన్ని భక్తితో మాత్రమే చూస్తారు అందుకే అతన్ని మహాత్ముడిగా చూస్తారు . ఆయన్ని ఒక సాధారణ మనిషిగానే చూశాను. అందుకే అయన సన్నిహితులకంటే ఎక్కవగా ఆయన్ని అర్థం చేసుకోగలను .
బిబిసి విలేకరి :
మీరు ఆయనలో ఎం తెలుసుకున్నారు ?

అంబేద్కర్:
నేను బయట వున్నాను బయట పరపంచానికి సంబంధించి ఒక విషయం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది గాంధీ విషయంలో పశ్చాత్య ప్రపంచం నాకు అర్తం కాదు . నా దృష్టిలో మాత్రం అయన భారతదేశ చరిత్రలో ఒక పరాన్న జీవి శాంతి స్తపకుడు కాదు . కాంగ్రెస్ పార్టీ అయన పుట్టిన రోజునాడు లేదా మరునాడు సెలవు ప్రకటిస్తుంది ఏదో కార్యక్రమం చేపడుతుంది . ఏడూ రోజుల పాటు కార్యక్రమాలు జరుపుతుంది అందుకే గాంధీజీ ప్రజలకు గుర్తున్నారు. ఈ కృత్రిమ ప్రయత్నం లేకపోతె ఆయన్ని చాల కాలం క్రిందటే ప్రజలు మరచిపోఎవారు .

బిబిసి విలేకరి :
మౌలిక మార్పులు ఏమి మీరు ఆశించలేద ?

అంబేద్కర్ :
లేదు లేదు , అయన ఎప్పుడు దంద్వ వైకరితోవుందేవారు అయన రెండు పత్రికలూ నడిపేవారు . ఇంగ్లీషులో హరిజన్ దానికి ముందు యంగ్ ఇండియా నడిపారి . గుజరాతిలో మరో పత్రికను నడిపారు . దాని పేరు దీనబంధు .. అదే తరహాలో వుండేది ఆ రెండు పత్రికలను చదివితే అయన ప్రజలను ఎలా తప్పు దారి పట్టిస్తున్నారో అర్థం అవుతుంది ఇంగ్లీష్ పత్రికలో అయన కుల వ్యవస్తను , ఆంటరానితనానికి వ్యతిరేకిగా ప్రజసామ్యవాదిగ చెప్పుకుంటారు. గుజరాతీ పత్రిక చుడండి శుద్ధ సంప్రదాయవాదిగా కనిపిస్తారు . వర్ణ శ్రమ ధర్మం పేరుతొ కులవ్యవస్తాను సమర్దిస్తారు. ఈ వ్యవస్తే భారతదేశాన్ని తరతరాలుగా కుంగదీసింది. ఎవరియన గాంధీజీ జీవిత చరిత్ర రాయాలంటే ఇంగ్లీష్ పత్రికలో,గుజరాతీ పత్రికలో ఆయన ప్రకటనలపై పూర్తి అధ్యయనం చేయాలి హరిజన్లో ప్రకటనలను అధ్యయనం చేయాలి కాని ప్రాశ్చాత్య ప్రపంచం కేవలం ఇంగ్లీష్ పత్రికలను మాత్రమే చదువుతుంది . అందులో అయన ప్రాశ్చాత్య ధోరణికి అనుకూలంగా రాస్తారు ప్రజాస్వామిక విలువలను సమర్దిస్తారు . ఆయనపై రాసిన జీవిత చరిత్ర పుస్తకాలన్నీ యంగ్ ఇండియా , హరిజన్ ల ఆధారంగా వ్రాసినవే . గుజరాతి పత్రికలో గాంధీజీ ఎంవ్రాసారో తెలుసుకొని కావు.

బిబిసి విలేకరి :
సేడ్ద్యుల్ కులాలపై గాంధీజీ నిజమైన వైకరి ఏమిటి

అంబేద్కర్:
ఆయన కేవలం కోరుకున్నారు . అంటరానితనాన్ని నిర్మూలించడం మా కోరిక మిగితవారితో సమానంగా మాకు అవకాశాలు కావాలనేది మా కోరిక అప్పుడే మేం అందరితో సమానంగా ఎదిగే అవకాసం వుంటుంది కేవలం అంటరానితనం నిర్ములనతో ఉపయోగం వుండదు 2000 ఏళ్లుగా అంటరానితనం భరిస్తున్నాం దీన్ని గురించి బాధ పడేవాళ్ళు ఎవరు లేరు సమాజానికి హానిచేసే కొన్ని లోపాలు వున్నాయి. సాగు చేయడానికి కొంత పొలం వున్నా ఇతర ముక్య అంశాలుకూడా వున్నాయి . దేశంలో సమానత్వం కావలి . వారు వున్నత పదవులు పొంద గలిగితే వారి గౌరవం పెరుగుతుంది తమ సొంతవారిని కాపాడుకోగలరు కాని గాంధీజీ పూర్తిగా వ్యతికేరించినారు అవును పూర్తిగా వ్యతికేరించినారు.

బిబిసి విలేకరి :
ఆలయ ప్రేవేశం వంటి వాటిపై ………….. ?

అంబేద్కర్ :
ఆలయ ప్రవేశం , ఆయన దానిమీద దృష్టిపెట్టిన ఎప్పుడు ఎవరూ హిందూ ఆలయలగురించి పట్టించుకోవడంలేదు. కేవలం ఆలయానికి వెళ్ళడం ముఖ్యం కాదనే చైతన్యం అంటరాని వారిలో వచ్చింది. వారు అంటరాని ఇళ్ళలో వుంటారు గుడికి వెళ్ళడం వెళ్లకపోవడం పెద్ద విషయం కాదు. ఒకప్పుడు కాలుష్యం కారణంగా రైళ్ళలో వేల్లనిచ్చేవారుకాదు. ఇప్పుడా పరిస్తితి లేదు . ఎందుకంటే రైల్యెలు ప్రత్త్యెక ఏర్పాట్లు చెయ్యలేవు . అంత కలిసే ప్రయాణిస్తున్నారు . పరస్పరం ఎదురుపడితే పాతభావాలు తప్పక గుర్తుకువస్తయి.

బిబిసి విలేకరి :
అంటే గాంధీ సాంప్రదాయ హిందువు అంటారా ?

అంబేద్కర్ :
కచ్చితంగా ఆయన సాంప్రదాయ హిందూ ఆయన ఎప్పుడు సంస్కరణవాది కాదు ఆయనలో ఆ తరహ లక్షణాలు లేవు . అంటరానివారు తన స్వరాజ్ వ్యతిరేకించకుండా వుండాలని గాంధీజీ కోరుకున్నారు. ఇంతకుమించి వారి అభ్యున్నతి ఆయన కోరుకున్నారని నేను అనుకోను. అమెరికాలో నల్లజాతి కోసం పోరాడిన గారిసన్ లాంటి వారు కాదు గాంధీజీ.