బీజేపీ అభ్యర్థిని బెదిరించిన ‘గంగుల’పై కేసు.

కరీంనగర్:

టిఆర్ఎస్ అభ్యర్థి గంగులపై కేసు నమోదయింది. ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల ప్రకారం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. బీజేపీ నేత బండి సంజయ్ ని విలేకరుల సమావేశంలో బహిరంగ బెదిరింపు పై స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు కలెక్టర్ విచారణ జరిపారు. అనంతరం ఆయనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు ప్రకటించారు.